కృత్రిమ అవయవాల వితరణ | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ అవయవాల వితరణ

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

కొరుక్కుపేట: కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) భగవాన్‌ మహావీర్‌ వికలాంగ్‌ సహాయతా సమితి(బీఎంవీఎస్‌ఎస్‌)–దక్షిణ భారతకేంద్రం సంయక్త ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి మూడు రోజులు పాటూ నిర్వహించినజైపూర్‌ ఫుట్‌క్యాంప్‌ విజయవంతంగా నిర్వహించారు . శనివారం మద్యాహ్నం జరిగిన ముగింపు కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్‌ చిన్ని బాలాజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 825 మందికి పైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు (జైపూర్‌ ఫుట్‌) అయిన చేతులు, కాలిపర్లు, వీల్‌ ఛైర్లు, ట్రై సైకిళ్లను అతిథిగా పాల్గొన్న అడిషనల్‌ సాలిసిటర్‌ ఆప్‌ జనరల్‌ ఆఫ్‌ తమిళనాడు ఎల్‌ సుందరేశన్‌ తోపాటు , దాతల, ఎస్‌కెపీడి ట్రస్టీల చేతులమీదుగా అందజేశారు. అర్హులైన లబ్దిదారులకు నేరుగా వారి సైజ్‌లు తీసుకుని తయారు చేసిఅందించినట్టు కరస్పాండెంట్‌ చిన్నిబాలాజీ తెలిపారు. ఇందులో ఎస్‌కేపీడీ ట్రస్టీలు దేసు లక్ష్మీ నారాయణ, ఎస్‌ఎల్‌ సుదర్శనం, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వనజ , డీన్‌ పీబీ వనిత, భరణికుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement