కొరుక్కుపేట: చైన్నె మైలాపూర్‌లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందించాల్సిన నిధుల పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమిళనాడులో ఏకై క సొంత భవనం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం. గత కొన్ని సంవత్సరాలుగా స్మారక భవనం నిర్వాహణకు అందించాల్సిన నిధులు పూర్తిగా రాకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది. దీంతో భవన నిర్వాహక కమిటీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి తన సొంత నిధులతో భవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. శనివారం చైన్నె వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ స్మారక భవనాన్ని సందర్శించి అమరజీవి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రిని స్మారక భవనం సజావుగా సాగేందుకు ప్రభుత్వ పరంగా నిధుల కొరత ఉందని, అందుకోసం మంత్రి చొరవ తీసుకోవాలని అనిల్‌కుమార్‌రెడ్డి, వూరా శశికళ, డాక్టర్ ఏవీ శివకుమార్ వినతిపత్రం అందచేశారు. స్పందించిన ఆయన స్మారక భవనం నిధుల సమస్యను పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్, రామాంజనేయులు పాల్గొన్నారు.


