అడవి ఏనుగుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

అడవి ఏనుగుల బీభత్సం

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

● పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు ● ఆందోళనలో రైతులు

వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని గ్రామాల్లో అటవీ ఏనుగులు చొరబడి వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో క్రిష్టియన్‌పేట ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో పూర్తిగా అటవీ ప్రాంతాలు అధికంగా ఉండడంతో తరచూ ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరు, బంగారుపాళ్యం, తుమ్మిందపాళ్యం మీదుగా అటవీ ఏనుగులు తమిళనాడులోని వేలూరుకు జిల్లాకు చొరబడుతుంది. దీంతో అటవీశాఖ అధికారులు గ్రామస్తుల సాయంతో పలుమార్లు బాణసంచా పేల్చి డప్పులు వాయించి ఏనుగులను తరిమి వేసినప్పటికీ రాత్రి వేలల్లో వ్యవసాయ పంటలపై పడి పూర్తిగా నాశనం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి అటవీ ఏనుగులు గుంపు ఒకే సారిగా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్‌పేటలోని వ్యవసాయ పంటలపై పడి, కొబ్బరి, అరటి చెట్లు, వరి పంటలు, రాగి పంటను పూర్తిగా నాశనం చేసింది. వేసవి కాలంలో ఎంతో కష్టపడి పండించిన పంటలు పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement