కోలాహలం.. తీర్థేశ్వరుడి రఽథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కోలాహలం.. తీర్థేశ్వరుడి రఽథోత్సవం

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

తిరువళ్లూరు: తీర్థేశ్వరుడి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మాత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం స్వామివారు అమ్మవారితో కలసి రథం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. తిరువళ్లూరులోని శ్రీ త్రిపుర సుందరి సమేత తీర్థేశ్వరుడి ఆలయం వుంది. ఆలయంలో ప్రతి ఏటా పంగుణి, మాసి మాసంలో 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 14న విఘ్నేశ్వర ఉత్సవం, 15న ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. మొదట స్వామి వారు అమ్మవారికి ప్రత్యేక అబిషేకం నిర్వహించి రథం వద్దకు తీసుకెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారు అమ్మవారితో కలిసి రథం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement