డయాబెటిస్‌ చికిత్సలో అత్యాధునిక విధానం | - | Sakshi
Sakshi News home page

డయాబెటిస్‌ చికిత్సలో అత్యాధునిక విధానం

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

సాక్షి,చైన్నె : డయాబెటిస్‌ చికిత్సలో వస్తున్న అత్యాధునిక మార్పులు , అనుబంధ ఆరోగ్య సమస్యల నిర్వహణపై చర్చించేందుకు చైన్నెలోని ఎంబీ హాస్పిటల్‌ ఫర్‌ డయాబెటిస్‌’ ఆధ్వర్యంలో ఎంవీ కాన్‌ 2026 పేరిట మూడు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 22 వరకు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మంది వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొంటున్నారు.

ప్రముఖులకు పురస్కారాలు

డయాబెటిస్‌ పరిశోధనల్లో విశేష కృషి చేసిన కేంద్ర మంత్రి , ప్రముఖ డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌కు ఎం.వి. లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు. అలాగే, మెడిమిక్స్‌ బ్రాండ్‌ అధినేత ఎ.వి. అనూప్‌కు ఆరోగ్య రంగంలో చేసిన సేవలకుగానూ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఈసదస్సులో అందించారు.

అత్యాధునిక చికిత్సలపై చర్చ

డయాబెటిస్‌ వలన్ల కిడ్నీలు, కళ్లు, గుండైపె పడే ప్రభావం, అలాగే ’డయాబెటిక్‌ ఫుట్‌’ సమస్యలను ఎలా నివారించాలనే అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. వైద్యులకు అత్యాధునిక గాయాల చికిత్స, నెగటివ్‌ ప్రెజర్‌ వౌండ్‌ థెరపీ వంటి అంశాలపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ తమిళనాడుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, యువ వైద్యులు డయాబెటిస్‌ పరిశోధనల్లో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఎంవీ హాస్పిటల్‌ సీఈఓ డాక్టర్‌ విశ్వనాథన్‌ విష్ణు విజయ్‌ మాట్లాడుతూ మధుమేహాన్ని కేవలం నియంత్రించడం మాత్రమే కాకుండా, దానివల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ విజయ్‌ విశ్వనాథన్‌, డాక్టర్‌ ప్రశాంత్‌ అరుణ్‌, డాక్టర్‌ ఎస్‌.ఎన్‌. నరసింగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement