సాక్షి,చైన్నె : దేశంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షో నెట్‌వర్క్ టీటీఎఫ్ (ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్) నేతృత్వంలో శుక్రవారం చైన్నె ట్రేడ్ సెంటర్‌లో ప్రారంభమైంది. దక్షిణాది పర్యాటక ఖ్యాతి, వృద్ధిని చాటే విధంగా ఫెయిర్ ఫెస్ట్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రద ర్శనలో 12కు పైగా భారతీయ రాష్ట్రాలు, 5 దేశాల నుంచి 250కి పైగా ఎగ్జిబిటర్లు తరలివచ్చారు. తమిళనాడు పర్యాటక శాఖ కమిషనర్, ఎండి జె. ఇన్నోసెంట్ దివ్య, మహారాష్ట్ర పర్యాటక డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎన్.పాటిల్, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ డి. వెంకటేశన్ కార్యక్రమానికి హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.ఈ ఏడాది నేపాల్ పార్టనర్ కంట్రీగా వ్యవహరిస్తుండగా, గోవా, కేరళ రాష్ట్రాలు పార్టనర్ స్టేట్స్‌గా ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, భారత పర్యాటక శాఖ (ఇన్‌క్రెడిబుల్ ఇండియా) ఫీచర్డ్ పార్టనర్స్‌గా ఈ ప్రదర్శనలో ఉన్నాయి. శ్రీలంక, సింగపూర్, చైనా, భూటాన్, యూఏఈ వంటి దేశాల నుంచి ప్రతినిధులు తమ పర్యాటక రంగ విశేషాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.ఫెయిర్‌ఫెస్ట్ మీడియా చైర్మన్ సీఈఓ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘పర్యాటక రంగంలో చైన్నె కీలకమైన మార్కెట్‌గా పేర్కొన్నారు.


