తిరువళ్లూరు: కాంగ్రెస్‌లో వర్గపోరుకు చోటివ్వకుండా పార్టీ అభ్యర్దులు, కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని డీసీసీ అధ్యక్షుడు శశికుమార్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శశికుమార్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీలో వర్గవిభేదాలకు తావు లేకుండా పార్టీ నిర్దేశించిన అభ్యర్దుల విజయం కోసం పని చేయాలని సూచించారు. కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని హమీ ఇచ్చారు. నేతలు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బూత్‌కమిటీల బలోపేతం చేయడంతో పాటు పార్టీకి దూరమైన వారిని మళ్లీ క్రియాశీలకంగా పని చేసేలా సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సినీయర్ నేతలు ఏకాటూరు ఆనందన్, హిమాలయ అరుణ్‌ప్రసాధ్, రాష్ట్ర కార్యదర్శి సంపత్, ఓబిసి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేషన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, మైనారీటి విభాగం జిల్లా అద్యక్షుడు ఖలీల్ రహ్మాన్, కడంబత్తూరు మండల అద్యక్షుడు సతీష్‌తో పాటు పలువురు పాల్గోన్నారు.


