ఘనంగా ఉగాది వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉగాది వేడుకలు

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఉగాది పండుగ వేడుకలను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని వేలూరులోని టీటీడీ సమాచార కేంద్రంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, పంచాంగ పూజలు చేపట్టారు. ముందుగా స్వామివారి ఆలయా న్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతోపాటు మా మిడి, ఆరటి ఆకుల తోరణాలతో అలంకరించారు. అనంతరం ఈ ఉగాది నుంచి ప్రజలకు అన్ని సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ స్వామి వారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఉగాదిని పురస్కరించుకొని వేలూరులో స్వామివారిని దర్శించుకునేందుకు ఉద యం నుంచే భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా వేలూరు జిల్లా నాయుడు సంఘం ప్రతినిధులు సెవన్‌జీ మురళీఽ, శ్రీనారాయణి ఆసుపత్రి డైరెక్టర్‌ బాలాజీ అధ్యక్షతన స్వామివారికి పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. వాలాజ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో ఉదయం 6 గంటలకే ధన్వంతరి పెరుమాళ్‌ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు.ఉగాదిని పురస్కరించుకొని ఆలయంలో మామి డి ఆకులు, పుష్పాలంకరణ చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉగాది పండుగ కావడంతో వేలూరు, తిరువణ్ణామలైలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement