బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ..
తమిళ పంచాంగం ఆవిష్కరణ
వేలూరు: వేలూరు బ్రాహ్మణ సంఘం అద్వర్యంలో పరాభవ నామ సంవత్సర తమిళ పంచాంగం అవిష్కరణ కార్యక్రమం ఆ సంఘం జిల్లా అద్యక్షులు రాజ అద్యక్షతన జరిగింది. ముందుగా వేద మంత్ర పటనంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్బంగా సంగం ప్రతినిధులు మాట్లాడుతూ పంచాంగం అనేది బ్రాహ్మణ సమాజ సంప్రదాయాలకు వారసత్వానికి ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు. తిధి, వారము, కరణము, యోగము, నక్షత్రము వంటి అంశాలను తెలుసుకోవాడానికి అనుగుణంగాను శుభ కార్యాలను చేపట్టడానికి బ్రాహ్మణలందరూ రోజూ తప్పక పంచాంగాన్ని సంప్రదించడం ముఖ్యమన్నారు. ఇది తొమ్మిది గ్రహాల కక్ష్య చలనాలకు సంబందించిన ఖగోళ గణాంకాలపై ఆదారపడి కాలమాన లెక్కల ద్వారా రూపొందించబడిందన్నారు. ఇది బ్రాహ్మణుల ఒక అనివార్య కార్యమైన మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. శుభ కార్యాలు, పండుగలు, ఆలయ పునరుద్ధరణ పనులు వంటివన్నీ పంచాంగం ఆదారంగానే అత్యంత నిశితంగా ప్రణాళిక చేయబడిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లలో ప్రతి రోజూ దైవ నామాలను స్మరిస్తూ శ్లోకాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి శేఖర్, ఆ సంఘం ప్రతినిధులు గణపతి, క్రిష్ణమూర్తి, సాయి శంకర్ బాబు, సుగంది, కోశాధికారి రాజగోపాల్ సలహాదారులు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.


