తమిళసినిమా: ఎట్టకేలకు ఎల్‌ఐకే ( లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చిత్ర విడుదల తేదీ ఖరారు అయ్యింది. క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి కృతిశెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రానికి విఘ్నష్ శివన్ కథా, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. నటుడు ఎస్కే సూర్య యోగిబాబు గౌరీ కిషన్ సారా తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఇందులో సీమాన్ కీలక పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్‌ఎస్ లలిత్ కుమార్, రౌడీ పిక్చర్స్ అధినేత , నటి నయనతార కలిసి నిర్మించడం విశేషం. అనిరుద్ సంగీతాన్ని, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని చాలా కాలం అయ్యింది. నిజానికి ఈ చిత్రాన్ని గత ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయనునట్లు ప్రకటించారు. అయితే అదే తేదీన ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో చిత్రం డ్యూడ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటిండంతో ఈ చిత్ర విడుదలను వాయిదా వేశారు. కాగా ఎట్టకేలకు ఎల్‌ఐకే చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇది సైన్స్ ఫిక్షన్‌తో వైవిధ్యభరిత ప్రేమ కథ చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. తన ప్రేమను కాపాడుకోవడానికి పోరాడే కథ ఇతని తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విచిత్రంలోని పాటలు టీజర్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణను పొందాయని, చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. డ్యూడ్ వంటీ సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రం విడుదల కొనుండటంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఎల్‌ఐకే చిత్రంలో
ఎస్‌జే సూర్య,
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి


