సాక్షి,చైన్నె : చైన్నెలోని వీఎస్ హాస్పిటల్ అరుదైన క్యాన్సర్ చికిత్సను విజయవంతం చేశారు. సాధారణంగా చేతులు, కాళ్లు లేదా మెడ భాగాల్లో కనిపించే శ్రీమయోపెరిసైటోమాశ్రీ అనే అత్యంత అరుదైన ట్యూమర్‌ను 64 ఏళ్ల రిటైర్డ్ టీచర్ రొమ్ములో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా రొమ్ము ఆకారాన్ని దెబ్బతీయకుండానే ఈ క్యాన్సర్ గడ్డను తొలగించారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటాచలం వీరప్పన్ నేతృత్వంలోని బృందం శ్రీఆంకోప్లాస్టిక్ రికన్సస్ట్రక్షన్ శ్రీ పద్ధతిని ఉపయోగించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఈ కారణంగా క్యాన్సర్ గడ్డను పూర్తిగా తొలగించడమే కాకుండా, రొమ్ము యొక్క సహజమైన ఆకృతిని , సమతుల్యతను రక్షించారు. శస్త్రచికిత్స జరిగిన కేవలం 24 గంటల్లోనే రోగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని వైద్యుల బృందం తెలిపింది. బాధితురాలు తన కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటంతో, రొమ్ములో అసౌకర్యంగా అనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించారని వివరించారు. డిజిటల్ ఎక్స్–రే మామోగ్రఫీ , బయాప్సీ ద్వారా ఈ అరుదైన ట్యూమర్‌ను గుర్తించామని, హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యన్ వివరించారు. ఆయన మాట్లాడుతూ, శ్రీప్రపంచంలోనే అతి తక్కువగా నమోదైన కేసుల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారు. ఇలాంటి అరుదైన కేసుల్లో శస్త్రచికిత్స ప్రణాళిక చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని, రొమ్ము ఆకృతిని కాపాడుతూనే క్యాన్సర్‌ను తొలగించినందుకు గర్విస్తున్నాయమన్నారు. ప్రతి నెలా మహిళలు స్వయంగా రొమ్ము పరీక్షలు చేసుకోవాలని, క్రమం తప్పకుండా క్లినికల్ చెకప్‌లు , మామోగ్రఫీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు.


