వేలూరు: తిరువణ్ణామలై జిల్లా కీల్ పెన్నాతూరు నియోజక వర్గం పరిధిలోని వేట్టవలం ప్రాంతంలో ఎన్నికల ప్రత్యేక స్క్వాడ్ అధికారులు బుధవారం ఉదయం వాహన తనఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వచ్చిన మినీ వ్యాన్‌ను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లేని రూ.4.13లక్షల నగదును, మినీ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వచ్చిన కారును తనఖీ చేయగా అందులో 51 పంచలోహ విగ్రహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ: లక్షా 20 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పుదుచ్చేరి నుంచి ఈ విగ్రహాలను కొనుగోలు చేసి తిరువణ్ణామలై రోడ్డులో విక్రయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. అయితే వీటికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆ మార్గంలో ఎటువంటి ఆదారాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న 40 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


