వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ వేలూరు జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలను డీఎంకే కై వసం చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతంలోని డివిజన్ కార్యదర్శులు నియోజక వర్గాల్లో విసృతంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. నియోజక వర్గాల్లో అధిష్టానం ఎవరికి సీటు కేటాయించినా కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం సమావేశంలో నియోజక వర్గాల్లో ప్రచారాలు నిర్వహించడంపై పై సమీక్షించి తీర్మానం చేశారు. ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, పార్టీ జిల్లా కోశాధికారి దమోదరన్, మాజీ ఎంపీ మహ్మద్‌సఖీ, మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్, యూనియన్ కార్యదర్శులు జ్ఞానశేఖరన్, గజేంద్రన్, మురుగ పెరుమాల్, తంగదురై పాల్గొన్నారు.


