రైల్వే ట్రాక్‌ల సమీపంలో చెత్త తగల బెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌ల సమీపంలో చెత్త తగల బెట్టొద్దు

Mar 19 2026 7:51 AM | Updated on Mar 19 2026 7:51 AM

● ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకండి ● దక్షిణ రైల్వే వినతి

సాక్షి, చైన్నె: రైల్వే ట్రాక్‌ల సమీపంలో చెత్తను కాల్చవద్దని చైన్నె డివిజన్‌ ప్రజలకు రైల్వే విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తి చేస్తోంది. ట్రాక్‌ల సమీపంలో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే కార్యకలాపాలలో పాల్పడ వద్దని దక్షిణ రైల్వే చైన్నె డివిజన్‌ ప్రజలను, ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభం కావడంతో ఇటువంటి అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉన్నందున, అత్యంత జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల, రైల్వే ట్రాక్‌ల సమీపంలో చెత్తను, ఎండిన మొక్కలను కాల్చే ఘటనలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. ఇటువంటి కార్యకలాపాలు రైల్వే భద్రతకు, కార్యకలాపాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను కాల్చడం వల్ల వెలువడే అధిక వేడి, పొగ కారణంగా రైళ్లకు విద్యుత్‌ను సరఫరా చేసే ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ , సున్నితమైన సిగ్నలింగ్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరంచారు. దీనివల్ల రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో పాటు ప్రయాణికుల భద్రతకు కూడా ప్రమాదం వాటిల్లవచ్చని రైల్వే హెచ్చరించింది. ఒక చిన్న అజాగ్రత్త కూడా భారీ పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంటూ, ప్రజలు రైలు పట్టాల దగ్గర ఎండు ఆకులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేదా మండే పదార్థాలను వేయవద్దు అని విన్నవించారు.రైల్వే ప్రాంగణంలో మండే పదార్థాలను ఉంచవద్దు అని, రైల్వే ప్రాంగణాల సమీపంలో చెత్త లేదా వ్యర్థాలను కాల్చడాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. నిబంధనలు అతి క్రమిస్తే, రైల్వే చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. రైల్వేలను సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించాలనివిన్నవించారు. సురక్షితమైన, సజావుగా రైలు రాకపోకలను నిర్ధారించడానికి, రైల్వే ఆస్తులను పరిరక్షించడానికి ప్రజల నుండి సంపూర్ణ సహకారాన్ని కోరుతన్నామని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement