స్పేస్‌ కిడ్స్‌ ఇండియాకు సర్టిఫికెట్‌ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

స్పేస్‌ కిడ్స్‌ ఇండియాకు సర్టిఫికెట్‌ ప్రదానం

Feb 26 2026 7:40 AM | Updated on Feb 26 2026 7:40 AM

స్పేస్‌ కిడ్స్‌ ఇండియాకు సర్టిఫికెట్‌ ప్రదానం

స్పేస్‌ కిడ్స్‌ ఇండియాకు సర్టిఫికెట్‌ ప్రదానం

కొరుక్కుపేట: స్పేస్‌ కిడ్జ్‌ రాసిన క్యూబ్‌శాట్‌ 101: ఇన్‌ సెప్షన్‌ టూ ఆపరేషన్స్‌ అనే సమగ్ర ఉపగ్రహ విద్య పాఠ్యాంశ పుస్తకంకు ఆనూహ్యమైన స్పందన అభిస్తుంది. దీంతో ఈ పుస్తకాన్ని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ – ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌ అండ్‌ స్పేస్‌ )లో ప్రస్తుతం ప్రమోషన్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా, పాఠ్యాంశాల విద్యా దృఢత్వం, సాంకేతిక బలం, జాతీయ ఔచిత్యాన్ని గుర్తించి స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్‌ శ్రీమతి కేసన్‌కు సర్టిఫికేషన్‌ ప్రదానం చే శారు. ఈ సందర్భంగా ఆమె తన స్పందన తెలియజేస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన అంతరిక్ష విద్య వైపు స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ఒక ప్రధాన మైలురాయి సాధించిందని తెలిపారు. స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా తన సమగ్ర పాఠ్య పుస్తకం‘క్యూబ్‌శాట్‌ 101: ఇన్‌సెప్షన్‌ టూ ఆపరేషన్స్‌ అధికారికంగా ఆవిష్కరించబడిందని గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం భారతదేశంలో మైక్రో డిప్లొమాగా గుర్తింపు పొందిన మొట్టమొదటి అంకితమైన అంతరిక్ష పాఠ్యాంశంగా నిలుస్తుందని అంతేకాకుండా ఇది అధికారిక క్యూబ్‌శాట్‌ శిక్షణ, అంతరిక్ష సాంకేతిక విద్యలో కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement