రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా కణ్ణగినగర్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా కణ్ణగినగర్‌ జట్టు

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా కణ్ణగినగర్‌ జట్టు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా కణ్ణగినగర్‌ జట్టు

3 రోజులపాటు హోరాహోరీగా సాగిన పోటీలు పాల్గొన్న 30 జట్లు

తిరువొత్తియూరు: ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ జన్మదినం సందర్భంగా మహిళా విభాగంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు సైదాపేటలో ఆదివారం ముగిశాయి. ఈనెల 5వ తేదీ నుంచి 3 రోజుల పాటూ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన 30 కబడ్డీ జట్టు పాల్గొన్నాయి. 9 వేల మంది కూర్చుని మ్యాచ్‌లు చూసేలా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఇండోర్‌ స్టేడియం మైదానాన్ని చక్కగా సిద్ధం చేశారు. ఆట ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన కణ్ణగి నగర్‌ జట్టు దూకుడు ఆట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రత్యర్థి జట్లను ఓడించి కణ్ణగినగర్‌ జట్టు, ఒట్టన్‌చత్రం ఎస్‌.ఎం.వి.కె.సి జట్టు పైనల్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కణ్ణగి నగర్‌ జట్టు విజయం సాధించి ముఖ్యమంత్రి కప్పుతో పాటూ రూ.5 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. ఒట్టన్‌చత్రం జట్టుకు ద్వితీయ బహుమతిగా రూ. 3 లక్షలు లభించాయి. చైన్నె ఐ.సి.ఎఫ్‌, తిరువణ్ణామౖ లె ఫోనిక్స్‌ జట్లు సమాన పాయింట్లు సాధించి తృతీయ బహుమతిగా రూ.1.50 లక్షల చొప్పున బహుమతులు పొందాయి. పోటీల్లో విజేతలైన జట్లకు నటుడు వడివేలు, నటి దేవయాని బహుమతులు అందించారు. దేవయాని మాట్లాడుతూ, మహిళలు కబడ్డీ ఆడటం ప్రత్యక్షంగా చూసినప్పు డు సంతోషం కలిగిందన్నారు. ఉత్తమ క్రీడాకారిణులకు రూ. లక్ష విలువైన 4 ఐ ఫోన్లను మంత్రి సుబ్రమణియన్‌ కణ్ణగి నగర్‌ కార్తిక, వెన్నిలా కబడ్డీ బృందం శ్వేత, చైన్నె ఐ.సి.ఎఫ్‌ మంత్ర గోయల్‌ తిరువణ్ణామలైకు అందించారు. చివరగా ఆర్మీ జట్టు, తిరునల్వేలి భారతి జట్టు, చెంగల్పట్టు సి.ఎల్‌.ఎస్‌. సహా 4 జట్లకు తలా రూ. 50 వేల బహుమతి లభించింది.

కార్యక్రమంలో శాసనసభ్యులు ఎస్‌. అరవింద్రమేష్‌, కారపాక్కం గణపతి, ఏ.ఎం.వి. ప్రభాకర్‌ రాజా, డిప్యూటీ మేయర్‌ ము. మహేష్‌కుమార్‌, ఎన్నికల వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి వేలచ్చేరి మణిమరన్‌ మరియు మడిపాక్కం చింతన్‌, కళా సాహిత్య వేదిక సహాయ కార్యదర్శి ఎం.ఎస్‌. హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement