కడలూర్‌తో ఎన్‌ఎల్‌సీ ఒప్పందం
కొరుక్కుపేట: సీఎస్‌ఆర్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కడలూరు జిల్లా యంత్రాంగం తో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా కడలూరు జిల్లాలో ఉచిత ఆరోగ్య సంరక్షణ, సురక్షితమైన తాగునీరు, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి, చెరువల్లో పూడిక తీయడం వంటి గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించిన ఎన్‌ఎల్‌సీ విస్తృతమైన సీఎస్ ఆర్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందుకు ఎన్ ఎల్‌సీ ఇండియా కడలూరు జిల్లా పరిపాలన, డీఆర్‌డీ తో అవగాహన ఒప్పందాలను చేసుకుంది. కలెక్టర్ సిబి ఆదిత్య సెంథిల్‌కుమార్, అదనపు కలెక్టర్ (అభివృద్ధి), ఎన్‌ఎల్‌సీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వి.ఎస్. నారాయణమూర్తి, జిల్లా పరిపాలన అధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.


