ఫిట్‌నెస్‌తో సంపూర్ణ ఆరోగ్యం
సాక్షి,చైన్నె : ఫిట్‌నెస్‌తో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సినీనటుడు, మోటివేషనల్ స్పీకర్ ,ఫిట్నెస్ ఔత్సాహికుడుగణేష్ వెంకట్రామ్ అన్నారు. చైన్నె నంగనల్లూరులో పాల్సన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎస్‌వైఎన్‌సీ పేరుతో అత్యాధునిక ఫిట్‌నెస్ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గణేష్ వెంకట్రామ్ ప్రారంభించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈక్రమంలో ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లు దోహదపడతాయని అన్నారు. విద్యావేత్త నటుడు, పాల్సన్ గ్రూప్ నిర్వాహకులు డాక్టర్ ఎస్‌ఆర్ శ్యామ్‌పాల్ పాల్గొన్నారు .
తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో రెతులు 50 ఎకరాల విస్తీర్ణంలో చామంతి పంట సాగు చేశారు. ఈసారి పంట విరగబూసింది. చైన్నె, తిరువళ్లూరు, తిరుపతి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలతో పాటు పంటకు అనువుగా వాతావరణం వుండడంతో వీకేఆర్ పురం వద్ద చామంతి విరగబూసింది.
తిరుత్తణి


