క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Feb 8 2026 7:11 AM | Updated on Feb 8 2026 7:11 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

● చికిత్సతో మళ్లీ సాధారణ స్థితికి ● యువతి అనుమానస్పద మృతి

కరోనాతో వినికిడి

కోల్పోయిన మహిళ

సాక్షి, చైన్నె: కరోనా కారణంగా వినికిడి కోల్పోయిన మహిళా సాప్ట్‌వేర్‌కు తాజాగా ఎంజీఎం హెల్త్‌ కేర్‌ తొలిసారిగా ద్వైపాక్షిక కోక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. ఆమెకు వినికిడి శక్తిని పునరుద్ధరించారు. వివరాలు.. కరోనా బారిన పడ్డ అనేక మంది కొత్త రకం ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా చైన్నెకు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ మహిళా ఉద్యోగి కరోనా తుదుపరి పరిణామాలతో వినికిడి శక్తిని కోల్పోయారు. ఆమెకు వైద్య పరిశోధనలో ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ ఉన్నట్లు వైద్యుల పరిశోధనలో నిర్ధారించారు. ఒకే శస్త్రచికిత్సలో రెండు చెవులకు కోక్లియర్‌ ఇంప్లాంట్‌లు అమర్చడంతో పాటూ వెంటనే యాక్టివేట్‌ చేయడంతో మళ్లీ వినికిడి శక్తిని పునరుద్ధరించారు. ఈ శస్త్రచికిత్స ఎంజీఎం సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సంజీవ్‌ మొహంతి నేతృత్వంలోని బృందం 5 నుంచి 6 గంటల వ్యవధిలో సం క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం చేశారు. శస్త్రచికిత్స అనంతరం 48 గంటల్లోనే రోగిని డిశ్చార్జ్‌ చేశామన్నారు. రాబోయే 2 నుంచి 3 నెలల్లో ఆమెకు వినికిడి, మాట్లాడే సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల వచ్చే అవకాశం ఉందని డాక్టర్‌ మొహంతి తెలిపారు.

రైతు ఆత్మహత్య

అన్నానగర్‌: తిరుచ్చి సమీపంలో రెండు ఆవులు, దూడ వరుసగా మరణించడంతో ఆవేదనకు గురై ఓ రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సిరుగనూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెరకంబి కౌంటర్‌ స్ట్రీట్‌కి చెందిన లక్ష్మణన్‌ (63) రైతు. ఆవులను పెంచతూ, పాలు ద్వారా వచ్చే ఆదాయంతో అతను కుటుంబాన్ని పోషించేవాడు. ఈ స్థితిలో అతను పెంచుకుంటున్న రెండు ఆవులు, దూడ ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి. దీని కారణంగా లక్ష్మణన్‌ మానసికంగా కుంగిపోయాడు. ఆదాయం లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ స్థితిలో శుక్రవారం పొలానికి వెళ్లిన లక్ష్మణన్‌ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో కనిపించాడు. ఇది చూసిన ఇతర రైతులు తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక శనివారం విషాదకరంగా మరణించాడు. సిరుగనూర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేలూరు సెంట్రల్‌ జైలు ఉద్యోగి ఆత్మహత్య

వేలూరు: వేలూరు మహిళా సెంట్రల్‌ జైలు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా జోలార్‌ పేట సమీపంలోని అచ్చం మంగళం గ్రామానికి చెందిన రజిని(46) ఇతను వేలూరు మహిళా సెంట్రల్‌ జైలులో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య తమలరసి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్య గత రెండు నెలల క్రితం భర్తతో గొడవపడి అమ్మగారి ఇంటికి వెళ్లారు. ఇది ఇలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన రజిని తన భార్యకు ఫోన్‌ చేసి కాపురానికి రమ్మని పిలిచినట్లు తెలుస్తుంది. ఇందుకు భార్య అంగీకరించకపోవడంతో ఇంటిలోని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జోలార్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు

పైళ్లెన ఐదు నెలలకే..

తిరువళ్లూరు: పెళ్‌లైయిన ఐదు నెలలకే యువతి అనుమానాస్పద రీతిలో యువతి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అత్తివాక్కం ప్రాంతానికి చెందిన మురుగన్‌ కుమార్తె కౌసల్య(20). ఈమె చైన్నెలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం పొన్నేరిలోని ప్రైవేటు కళాశాలలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కౌసల్యకు తన సమీప బంధువైన తాపీ మేస్త్రి రాజేష్‌(30)తో ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈక్రమంలో శుక్రవారం యధావిధిగా రాజేష్‌ తాఫీ పనులకు వెళ్ళిపోగా, కౌసల్య ఇంట్లో వున్నట్టు తెలుస్తోంది. అయితే కౌసల్య ఇంట్లో నుంచి జారిపడి గాయమైనట్టు భర్త రాజేష్‌కు కొందరు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చి ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ వచ్చిన క్రమంలో శుక్రవారం అర్థరాత్రి కౌసల్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తండ్రి వైద్యశాలకు వచ్చి తన కుమార్తె విగత జీవిగా పడి వుండడాన్ని చూసి బోరున విలపించారు. అప్పు చేసి పెళ్లిచేశానని, తీరా కాళ్ల పారాణి ఆరకముందే తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయావా బిడ్డా అంటూ మురుగన్‌ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అనంతరం కుమార్తే మృతదేహాన్ని పరిశీలించిన తండ్రి, శరీరంపై గాయాలు ఉండడంతో మృతిపై అనుమానం ఉందని పొన్నేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రైవేటు వైద్యశాలలో వున్న మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం పొన్నేరి వైద్యశాలకు తరలించి భర్తతో పాటూ పలువురి వద్ద విచారణ చేపట్టారు. పెళ్‌లైయి ఐదు నెలలు అయిన క్రమంలో విచారణను ఆర్డీవో పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement