అమ్మ చెప్పింది! | - | Sakshi
Sakshi News home page

అమ్మ చెప్పింది!

Feb 8 2026 7:11 AM | Updated on Feb 8 2026 7:11 AM

అమ్మ చెప్పింది!

అమ్మ చెప్పింది!

తమిళసినిమా: కథానాయకి వారసురాలు కథానాయకి కావాలన్న రూలేమీ లేదు. అయితే ఎక్కువగా ఆ రూలే అమలవుతోందని చెప్పొచ్చు. సినిమా ప్రభావం అంతగా ఉంటుందన్నదానికి ఇదో ఉదాహరణ. చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీమణుల వారసురాళ్లు ఇప్పుడు ప్రముఖ కథానాయికలుగా రాణిస్తున్నారు. అలా తాజాగా కథానాయకిగా ఊర్వశి వారసురాలు రంగప్రవేశం చేశారు. మలయాళానికి చెందిన ఈమె బాలనటిగా రంగప్రవేశం చేసి మాతృభాషలో పలు చిత్రాల్లో నటించి ఆ తరువాత కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. బహుభాషా నటిగా రాణించారు. తమిళంలో ముందానై ముడిచ్చు ఈమె నటించిన తొలి చిత్రం. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాదించింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి స్గార్‌ హీరోయిన్‌గా వెలిగారు. తెలుగులో రుస్తం చిత్రంతో పరిచయం అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న ఊర్వశికి మలయాళ నటుడు మనోజ్‌ కే.విజయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి తేజలక్ష్మీ అనే కూతురు ఉంది. ఆ తరువాత మనస్పర్థల కారణంగా మనోజ్‌ కే.విజయన్‌, ఊర్వళి విడిపోయారు. ఒక వీరి వారసురాలి విషయానికి వస్తే ఇటీవలే కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే తల్లితో కలిసి ఓ మలయాళ చిత్రంలో నటించడం విశేషం. కాగా భామ నటిగా రంగప్రవేశానికి ముందు తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలు, సలహాల గురించి ఒక భేటీలో పేర్కొంటూ ‘నాకు ఏ విషయాన్నైనా లైట్‌గా తీసుకునే అలవాటు. చిన్నప్పటి నుంచి తోటి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించను. అలాంటిది సినిమా రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న తరువాత అమ్మా నాన్న చాలా విషయాల గురించి చెప్పారు. ముఖ్యంగా అనుకువ చాలా ముఖ్యం అని పలు మార్లు చెప్పారు. షూటింగ్‌కు చెప్పిన టైమ్‌కు ముందే స్పాట్‌లో ఉండాలని చెప్పారు. నన్నివేశాల గురించి ఎలాంటి టెన్షన్‌ పడకూడదనీ, లోటు పాటులను విషయంలో సర్దుకుపోవాలని అమ్మ చెప్పేవారు. షూటింగ్‌ స్పాట్‌లో అందరినీ సమానంగా చూడాలని, గౌరవించాలని చెప్పారు. సినిమా కూడా మన కుటుంబం లాంటిదని, అందులో ఉన్నవాళ్లంతా కుటుంబసభ్యులేనని తరచు చెబుతుంటారు ’ అని తేజలక్ష్మీ పేర్కొన్నారు. ఇటీవలే మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కోలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement