కాలానికి అనుగుణంగా మారాలి
తిరువళ్లూరు: వేగంగా మారుతున్న కాలానీకి అనుగుణంగా విద్యార్థులు అప్‌డేట్ కావాలని టీసీఎస్ వాణిజ్య విభాగం అద్యక్షుడు దీపక్‌నాథన్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్ రంగ సంస్థ ఆర్ట్స్ కళాశాల 23వ స్నాతకోత్సవం శనివారం వేల్‌టెక్ వర్సిటీలోని ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమానికి వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రంగరాజన్ అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ శాంతి అతిథులను ఆహ్వానించారు. విద్యాసంస్థల డైరెక్టర్ రంగరాజన్ మహాలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ స్కందకిషోర్ ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా చైన్నె టీసీఎస్ వాణిజ్య విభాగం అద్యక్షుడు దీపక్‌నాథన్ హాజరై ప్రసంగిస్తూ, కళాశాల ప్రపంచం వేర్వేరు అబివృద్ధి కార్యక్రమాలకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లాగే కాలానికి అనుగుణంగా తమనుతాము మార్చుకోవాలన్నారు. కృత్రిమ మేధస్సు, నైపుణ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం 389 మందికి డిగ్రీలను ప్రదానం చేశారు. అధ్యాపకులు డాక్టర్ తీర్థమలై, డాక్టర్ హేమలత విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


