దరఖాస్తుల పండుగ | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల పండుగ

Feb 7 2026 9:47 AM | Updated on Feb 7 2026 9:47 AM

దరఖాస

దరఖాస్తుల పండుగ

● టీవీకేలో సందడే సందడి ● 234 స్థానాల్లో పోటీకి దరఖాస్తుల పంపిణీ ● అధ్యక్షుడి కోసం తొలి దరఖాస్తు

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగంలో దరఖాస్తుల పండుగ శుక్రవారం మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణను ప్రారంభించారు. దరఖాస్తుల కోసం పెద్ద సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఈనెల 2న విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మూడో వసంతంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో విజయ్‌ అనేక ఒడిదొడుకులు, విషాద ఘటనలు ఎదుర్కొన్నా, చివరకు తన చివరి చిత్రం జననాయకన్‌ విడుదల వివాదంలో మునిగినా రాజకీయంగా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల ప్రచార వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు కమిటీని ప్రకటించారు. మ్యానిఫెస్టో కసరత్తులను వేగవంతం చేయించారు. చట్టపరంగా ఏవైనా చిక్కులు ఎదురైన పక్షంలో వాటిని ఎదుర్కొనేందుకు మరో కమిటీ అంటూ రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. తనతో ఎవరు కలసి వచ్చినా, రాకున్నా, అవసరం అయితే, ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ తరఫున ఎన్నికల్లో 234 స్థానాలలో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు విజయ్‌ నిర్ణయించారు.

విజయ్‌ కోసం తొలి దరఖాస్తు

తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న విజయ్‌ అభిమానులు ఈసారి పెద్ద ఎత్తున సీట్ల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా శుక్రవారం పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అదేసమయంలో తమ నియోజకవర్గంలో విజయ్‌ పోటీ చేయాలని దరఖాస్తులు అధిక సంఖ్యలో దాఖలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు అయితే, పార్టీ చిహ్నంతో విజిల్‌ వేస్తూ దరఖాస్తుల స్వీకరించారు. మహిళలు సైతం ఉదయాన్నే చైన్నెలోని టీవీకే కార్యాలయం వద్ద బారులు తీరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ తొలి దరఖాస్తును విజయ్‌ కోసం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మరికొందరు విజయ్‌ కోసం దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ నిర్వాహక కన్వీనర్‌ సెంగోట్టయన్‌, ముఖ్య నేతలు ఆదవ్‌అర్జున, నిర్మల్‌కుమార్‌. కె.పి. కృష్ణన్‌, జె.సి.డి. ప్రభాకర్‌, జిల్లా కార్యదర్శులు పార్టీ నాయకుడు విజయ్‌ పేరుతో, వారి స్వంత పేర్లతో విడివిడిగా దరఖాస్తులు పొందారు. తమిళనాడు అంతటా 234 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో ఒకే రోజు దరఖాస్తులు తీసుకున్నారు. ప్రత్యేక నియోజకవర్గాలు మినహా, మిగతా అన్ని నియోజకవర్గాలు విజయ్‌ పేరు మీద ప్రతిఒక్కరూ దరఖాస్తులు కొనుగోలు చేశారు. జనరల్‌ నియోజకవర్గానికి దరఖాస్తు రుసుము రూ.15 వేలు, ప్రత్యేక నియోజకవర్గానికి రూ. 10 వేలుగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆశామహులు 2వ తేదీ సమర్పించే విధంగా గడువును నిర్ణయించారు.

దరఖాస్తుల పండుగ 1
1/1

దరఖాస్తుల పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement