ఐసీఏల్ నుంచి కొత్త ఎన్‌సీడీల జారీ
సాక్షి చైన్నె : ఐసీఎల్‌ఫీ్ కార్ప్ తాజాగా సెక్యూర్డ్ రీడీ మబుల్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీలు)ను ఫిబ్రవరి 5వ తేదీ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా పెట్టుబడిదారులకు గరిష్టంగా 12.25 శాతం వరకు ప్రభావవంతమైన లాభదాయక దిగుబడి లభించనుంది. బుధవారం జరిగిన సమావేశంలో ఆ సంస్థ సీఎండీ అడ్వకేట్ కె.జి. అనిల్‌కుమార్ మాట్లాడుతూ, గతంలో పెట్టుబడిదారుల నుంచి లభించిన విశేష స్పందన, తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా ప్రస్తుతం మరింత భద్రమైన, ఆకర్షణీయమైన ఆర్థిక అవకాశాలను అందించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఇష్యూ ఫిబ్రవరి 18 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. దీనికి సీఆర్‌ఐఎస్‌ఐఎల్, స్టేబుల్ రేటింగ్ లభించిందని ఒక్కో ఎన్‌సీడీ విలువ రూ.1,000 కాగా, కనీస పెట్టుబడి మొత్తం రూ.10,000గా నిర్ణయించామన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా 13, 24, 36, 60, 72 నెలల కాలపరిమితితో మొత్తం 10 ఎంపికలు అందిస్తున్నామని వివరించారు. నెలవారీ, వార్షిక, సంచిత వడ్డీ ఎంపికలతో 10 శాతం నుంచి 12.25 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయని వివరించారు.


