తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు..
అన్నానగర్: రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు రెట్టింపు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రుణాలను మాఫీ చేయాలని కోరుతూ గత నవంబర్‌లో తమిళనాడు రైతులు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఆ సమయంలో నాగ్‌పూర్ రైల్వే పోలీసులు రైతులపై కేసు నమోదు చేశారు. దీనిని ఖండిస్తూ, జిల్లా కలెక్టర్ పిటిషన్ ద్వారా రైతులపై నమోదైన కేసు గురించి ప్రధాని మోడీకి తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ లింక్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను నేతృత్వంలో పెద్ద సంఖ్యలో రైతులు శుక్రవారం తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆ సమయంలో, వారు నోటిలో ఎలుకను పట్టుకొని, చొక్కా ధరించకుండా అర్ధనగ్నంగా ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కొనసాగిస్తామని కూడా వారు ప్రకటించారు.


