ఏడీజీపీ జయరామన్ సస్పెన్షన్ రద్దు
– త్వరలో విధుల్లోకి..
సాక్షి,చైన్నె : అదనపు డీజీపీ జయరామన్ సస్పెన్షన్‌ను రాష్ట్ర హోంశాఖ రద్దు చేసింది. ఆయన ఒకటి రెండు రోజులలో మళ్లీ విధులలోకి రానున్నారు. వివరాలు.. గత ఏడాది తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలో జరిగిన ఓ బాలుడి కిడ్నాప్ వ్యవహారం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈకేసులో పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే పూవై జగన్ మూర్తి, ఏడీజీపీ జయరామన్ పేర్లు తెర మీదకు రావడంతో పెద్ద రాద్ధాంతం సాగింది. ఈ కేసు కోర్టు వరకు వెళ్లింది. ఏడీజీపీ లొంగి పోయి విచారణకు హాజరు కావాల్సినపరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ని పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. గత కొన్ని నెలలుగా సాగుతూ వచ్చిన ఈ విచారణలో ఏడీజీపీ కారును ఆయనకు తెలియకుండానే కిడ్నాప్‌కు వాడి ఉండడం వెలుగు చూసింది. అలాగే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం చేసింది. కేసులు ఆయన ప్రేమయం అన్నది లేని దృష్ట్యా, కోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సప్పెన్షన్ రద్దుకు ఆదేశాలుజారీ అయ్యాయి. దీంతో తాజాగా ఆయనకు మళ్లీ బాద్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన సస్పెన్షన్‌ను బుధవారం రద్దు చేశారు. దీంతో ఆయన తిరిగి విధులలోకి రానున్నారు. అయితే ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వనున్నారో తేలాల్సి ఉంది.


