పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన
తిరువళ్లూరు: మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న మున్సిపల్ పాఠశాల భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ఆదేశించారు. తిరువళ్లూరులో రూ.4.44 కోట్లతో 25 తరగతి గదులతో నిర్మిస్తున్న పాఠశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ అధికారులతో కలసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై అఽధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతగా వుండేలా చూడాలని ఆదేశించారు. ఫ్లోరింగ్‌లో నాణ్యత లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన లోపం వున్నట్టు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నిర్మాణాలకు వాడుతున్న ఇటుక, సిమెంట్, ఇనుము నాణ్యతను పరిశీలించారు. కమిషనర్ దామోదరన్ పాల్గొన్నారు.


