పారిశుధ్య లోపంపై సీపీఎం ఆందోళన
తిరువళ్లూరు: మున్సిపాలిటీలో పారిశుధ్య లోపంపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సీపీఎం ఆద్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. తిరువళ్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమానికి నగర కార్యదర్శి ఉదయనిధి, పార్టీ జిల్లా కన్వీనర్ గోపాల్ హాజరయ్యారు. గోపాల్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుధ్యం లోపించి దోమల బెదడ ఎక్కువగా పెరిగిన క్రమంలో పాగింగ్ చేయాలని, వండికారన్ వీధిలో గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మురుగునీటి కాలువలను బాగు చేయాలని, 2023వ సంవత్సరంలో రూ.33 కోట్లతో ప్రారంభించిన బస్టాండు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, పెద్దకుప్పంలో పేరుకపోయిన మురు గునీటిని తొలగించడంతో పాటు నీటిని శుద్ధీకరణ చేసిన తరువాతే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిస్కరించని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ నేతలు కలైయరసన్, రాజేంద్రన్, తమిళరసు, కన్నన్ పాల్గొన్నారు.


