విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!
న్యూస్‌రీల్
రాష్ట్రంలో సమర్థంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సహాయక నిధుల విడుదలలో తమిళనాడుపై కేంద్రం వివక్ష సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు కట్టుదిట్టంగా భద్రత
అధికారులపై అసంతృప్తి
పూందమల్లి –పోరూర్ మధ్య మెట్రో రైలు మార్గం
కొరుక్కుపేట: పూందమల్లి–పోరూర్ మెట్రో రైలు మార్గానికి సిగ్నలింగ్ టెక్నాలజీని రైల్వే బోర్డు ఆమోదించిందని అధికారులు తెలిపారు. చైన్నె మెట్రో రైలు ప్రాజెక్టు రెండవ దశ 116.1 కి.మీ. దూరానికి అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రెండవ దశలో డ్రైవర్ రహిత మెట్రో రైళ్లను నడుపుతున్నారు. ఇందులో భాగంగా చైన్నె బీచ్ నుంచి పూందమల్లి వరకు 26 కి.మీ. దూరానికి మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు మొదటి దశలో, పూందమల్లి నుంచి పోరూర్ జంక్షన్ వరకు 10 కి.మీ. దూరంలో మెట్రో రైలు సర్వీసు త్వరలో ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానుంది. దీని కోసం మెట్రో రైలు యాజమాన్యం పనులను ముమ్మరం చేసింది. ఈ మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైళ్లను టెస్ట్ రన్ మూడు సార్లు నడిపినట్టు మెట్రో అధికారులు తెలియజేశారు. భారతీయ రైల్వే పరిశోధన, డిజైన్ , ప్రమాణాల సంస్థ అధికారుల సమక్షంలో మెట్రో రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. మెట్రో రైళ్లను 90 కి.మీ మార్గంలో నడిపారు. ప్రయాణికుల సౌకర్యాలను, ఇబ్బందులను గుర్తించారు. బ్రేకింగ్ టెక్నాలజీ, పట్టాల నాణ్యత, రైలు కార్ల సౌకర్యం, ప్రయాణికుల భద్రత పరీక్ష ఆధారంగా, మెట్రో రైలు జనవరిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అలాగే వారం క్రితం, పూందమల్లి–పోరూర్ మెట్రో రైలు ఆపరేషన్‌కు త్వరగా అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఓ లేఖ రాసింది. ఈ పరిస్థితిలో, పూందమల్లి–పోరూర్ మెట్రో రైలు మార్గానికి సిగ్నలింగ్ టెక్నాలజీని రైల్వే బోర్డు ఆమోదించినట్లు మెట్రో అధికారులు మంగళవారం తెలిపారు.
తనిఖీల సమయంలో..
అన్నానగర్: తూత్తుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి నటరాజపురం నివాసి అయిన శాంతి ఇటీవల చైన్నెలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఓ ఫిర్యాదు చేశారు. అందులో తాను, తన ఇద్దకు కుమార్తెలు ఇంట్లో ఉండగా.. కోవిల్‌పట్టి వెస్ట్ పోలీస్ స్టేషన్ సబ్–ఇన్‌స్పెక్టర్ హరిహరన్, మరో ఇద్దరు పోలీసులు శరవణ కుమార్, పాండియరాజ్ ఓ కేసు విషయంగా తన ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు, ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను, తనను అవమానించడమే కాకుండా.. రూ. 15,000 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కమిషన్ అధికారి కన్నదాసన్, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం పిటిషనర్‌కు రూ.2 లక్షలు పరిహారంగా చెల్లించాలని, సంబంధిత సబ్–ఇనన్‌స్పెక్టర్ నుంచి రూ. లక్ష, మిగతా ఇద్దరు పోలీసుల నుంచి రూ.50 వేలు చొప్పున వసూలు చేయాలని, సంబంధిత పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చైన్నె వేదికగా జయకృష్ణన్ ఉన్ని కళా ప్రదర్శన
సాక్షి,చైన్నె: చైన్నెలో జరుగుతున్న మార్గళి(ధనుర్ మాసం) సంగీత ఉత్సవాల సంగమానికి మరింత వన్నె తెచ్చే విధంగా కర్ణాటక్, పోర్ర్‌టెయిట్ కళాకారుడు డాక్టర్ జయకృష్ణన్ ఉన్ని సోలో ఆర్ట్ ప్రదర్శన జరగనుంది. చైన్నె సాంస్కృతిక కేంద్రం దృశ్యకళ, శాసీ్త్రయ సంగీత సంగమానికి వేదికగా ఈ కళా ప్రదర్శన నిలవనుంది. శాసీ్త్రయ సంగీత, నృత్య కళాకారులకు సంబంధించి 100కుపైగా చేతితో గీసిన పెన్సిల్ పోర్ర్‌టెయిట్‌లను ఇందులో ప్రదర్శించనున్నారు. రాగ్ రేఖ పేరిట కళాకారుడి జీవితాన్ని తీర్చిదిద్దిన రెండు కళాత్మక ప్రపంచాలను, సంగీతం, డ్రాయింగ్‌లను ఒక చోట చేర్చే విధంగా ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఆళ్వార్‌పేటలోని సీపీ ఆర్ట్ సెంటర్ ఈ ప్రదర్శనకు వేదికగా ఎంపిక చేశారు. చైన్నెలో జరుగుతున్న మార్గళి సంగీతోత్సవాలలో భాగంగా సంగీతకారులు, విద్యార్థులు, కళా ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని రాగ్ రేఖ శాసీ్త్రయ కళా వేదిక కానున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
రసాయనాలపై
ఉమ్మడి పరిశోధన కేంద్రం
సాక్షి, చైన్నె : చమురు బావులలో రసాయనాలపై ఉమ్మడి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం పోన్ ప్యూర్ కెమికల్స్‌లు ఒప్పందాలు చేసుకున్నాయి. కాటాన్ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ ఆవరణలో చమురు బావులలో రసాయనాల ఫార్ములేషన్, విశ్లేషణాత్మక పరిశోధన, ప్రయోగ శాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒప్పందాలపై ఎస్‌ఆర్‌ఎం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్ ముత్తమిళ్ సెల్వన్,పోన్ ప్యూర్ కెమికల్స్ ఎండీ సూర్య ప్రకాశ్‌లు సంతకాలు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అంచనా వ్యయంగా రూ. 75 లక్షలుగా నిర్ణయించామని ఈసందర్భంగా వారు ప్రకటించారు. పొన్ ప్యూర్ కెమికల్స్ సీఎస్‌ఆర్ నిధి ద్వారా రూ. 20 లక్షలు విలువైన పరికరాలను అందజేస్తుందన్నారు. ఈ కేంద్రం ప్రతిభావంతులైన కెమిస్రీ్ట్రపొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుని విపత్తులను సమర్థంగా ఎదుర్కొనడంలో దేశానికే తమిళనాడు మార్గదర్శకంగా ఉందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. అయితే విపత్తు సహాయ నిధికి తాము అడిగిన నిధులలో కేవలం 17 శాతాన్ని మాత్రమే కేంద్రం విడుదల చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సాక్షి, చైన్నె: సచివాలయంలో బుధవారం సీఎం స్టాలిన్ అధ్యక్షతన తమిళనాడు వాతావరణ మార్పులపై పాలక మండలి కమిటీ 3వ సమావేశం జరిగింది. మంత్రులు తంగం తెన్నరసు, శివ శంకర్, టీఆర్‌బీ రాజ, రాజకన్నప్పన్, సీఎస్ మురుగానందం, అటవీశాఖ కార్యదర్శి సుప్రియ సాహూతో పాటూ పలు శాఖల కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, తమిళనాడు వాతావరణ మార్పు పాలక మండలి సభ్యులు, ఆర్థికవేత్తలు, పర్యావరణ నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, దిత్వా తుఫాన్ శ్రీలంకలో ప్రళయ తాండవం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, దీనిని తమిళనాడులో సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకున్నముందు జాగ్రత్తలను వివరించారు. పెద్ద ప్రభావం అన్నది ఎదురు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. ఒకప్పుడు తుపాన్, వరదలు అంటే వణికి పోయే పరిస్థితి ఉండేదని, అయితే, మూడు సంవత్సరాల క్రితం విపత్తు నివారణే లక్ష్యంగా చేపట్టిన చర్యలు తాజాగా ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వాతావరణ మార్పుల పాలక మండలి, గ్రీన్ తమిళనాడు ఉద్యమం, తమిళనాడు తడి భూముల ఉద్యమం, తమిళనాడు వాతావరణ మార్పు ఉద్యమం, అడ్వానన్స్ – తమిళనాడు పునరుద్ధరణ ఉద్యమం అంటూ విపత్తులను సమర్థవతంగా ఎదుర్కొనే విషయంలో దేశానికే తమిళనాడు మార్గదర్శకంగా మారిందన్నారు. రూ. 24 కోట్లతో వాతావరణ అవగాహనలో భాగంగా 4 వేల మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఉన్నామని, వీరి ద్వారా త్వరలో అవగాహనలు, శిక్షణలు విస్తృతం చేయనున్నామని ప్రకటించారు. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులకు పర్యావరణ అవగాహన కల్పించడానికి సంవత్సరానికి రెండుసార్లు వేసవి, శీతాకాల ప్రత్యేక శిబిరాలను పాఠశాలలో రెండు రోజుల పాటుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖను ఈ సందర్భంగా ఆదేశించారు.
కూల్ రూఫింగ్ ప్రాజెక్టు
కూల్ రూఫింగ్ ప్రాజెక్టును తమిళనాడు క్‌లైమేట్ ఛేంజ్ అథారిటీ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, దీనిని ఒక ఉద్యమంగా ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లనున్నామని వివరించారు. అంబత్తూరులోని కామరాజర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గదులు చల్లదనంతో ఉండే విధంగా పై భాగంలో కూల్ రూఫింగ్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశామని, దీనిని మరో 297 హరిత పాఠశాలల్లో కూడా అమలు చేయడానికి యోచిస్తున్నామని తెలిపారు. కార్బన్ సమతుల్య కేంద్రాలు, వాతావరణ స్థితిస్థాపక గ్రామాలు, తీరప్రాంతాలలో బయో–షీల్డ్‌ల ఏర్పాటు వంటి ముఖ్యమైన చర్యలతో వాతావరణ మార్పు తగ్గింపు , అనుసరణ ప్రణాళికల అమలు విస్తృతం చేయనున్నామన్నారు. ఇందులో భాగంగా గత అక్టోబర్ నెలలో నీలగిరి, కోయంబత్తూర్, రామనాథపురం జిల్లాలకు డీకార్బనైజేషన్ మార్గాల కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించామన్నారు.
పెరిగిన మడ అడవుల విస్తీర్ణం
కడలూరు జిల్లా, పిచ్చవరం సమీపంలోని కిల్లాయిలో వాతావరణ స్థితిస్థాపక గ్రామాల ప్రాజెక్టు కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్తును ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. వరదలు ప్రమాదాలను నివారించడానికి బకింగ్‌హామ్ కాలువలో పూడిక తీత, పిచ్చవరం బోట్ ఫ్లీట్ కోసం పునరుత్పాదక విద్యుత్ శక్తి ద్వారా వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఆ గ్రామంలో మొదటి అడుగు వేశామన్నారు. ప్రకృతి ఆధారిత పరిష్కారాల ద్వారా తీరప్రాంత ఆవాసాలను రక్షించడం, పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటుతున్నామన్నారు. తమిళనాడులోని 4,500 హెక్టార్ల నుంచి 9 వేల హెక్టార్లలో అలయాత్తి కాడు (మడ అడవులు – మాంగ్రోవ్ ఫారెస్టు) విస్తరించామని, ఇది గొప్పవిజయం అని వ్యాఖ్యలు చేశారు. ఈ అడవులను మరింతగా విస్తరించే విధంగా ప్రణాళిక బద్దంగాముందు కెళ్తున్నామన్నారు. జల వనరులరక్షణ, పర్యావరణ పరిరక్షణ,కాలుష్య నియంత్రణ గురించి ఈ సందర్భంగా వివరిస్తూ, గ్రీన్ సర్టిఫికేషన్ పథకం అమల్లో సాధించిన అవార్డులను గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలలోచాలా వరకు మహిళలు బాలికలు బాధితులు అవుతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయన్నారు.
సేలం : తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ మీట్ ది పీపుల్ పర్యటనను మళ్లీ గురువారం ప్రారంభించనున్నారు. ఆయన రాకతో ఈరోడ్ విజయ మంగళం టోల్ గేట్ సమీపంలో భారీ ఏర్పాట్లు చేశారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కరూర్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 27వ తేదీన జరిగిన విజయ్ ప్రచారంలో చోటు చేసుకున్న పెను విషాదంతో మీట్ దిపీపుల్ కు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. సేలంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేసినా అనుమతి అన్నది దక్కలేదు. దీంతో తొలి సారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో విజయ్ పర్యటించి అక్కడి ప్రజలకు దగ్గరయ్యేప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి వచ్చిన సెంగొట్టయన్ తన బలాన్ని చాటే విధంగా కొంగు మండలంలో తన ఇలాకగా ఉన్న ఈరోడ్ వేదికగా విజయ్ పర్యటనకు ఏర్పాట్లు చేపట్టారు. ఈరోడ్ జిల్లా పెరుంతురై సమీపంలోని విజయ మంగళం టోల్‌గేట్ సమీపంలో బ్రహ్మాండ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అనేక ఆంక్షలు, షరతుల నడుమ విజయ్ పర్యటన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చేసిన ఏర్పాట్లను ఈరోడ్ జిల్లా ఎస్పీ సుజాత నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం బుధవారం పరిశీలించారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలే కాకుండా, ఎవ్వరెవ్వరికి ఏఏ ప్రాంతంలో సీట్లు కేటాయించారో అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లకుండా బారికేడ్లను అనేక చోట్ల విస్తృతం ఏర్పాట్లు చేశారు.
తోపులాటకు ఆస్కారం లేకుండా..
తోపులాట, తొక్కిసలాటకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షిస్తూ వస్తున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితులలో భుస్సీ ఆనంద్‌కు ఆహ్వానం పలికే విధంగా ఇరు వర్గాల అత్యుత్సాహం వివాదానికి దారి తీసింది. భుస్సీ ఆనంద్ సమక్షంలో ఇరు వర్గాలకు చెందిన కేడర్ ముష్టి యుద్ధానికి దిగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను జయప్రదం చేయాలని కేడర్‌కు ఆయన విన్నవించారు. గర్భిణిలు, వృద్ధుల, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి విజయ్ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది.
– అన్బుమణి నేతృత్వంలో నిరసన
సాక్షి, చైన్నె: తమిళనాడులో ప్రత్యేకంగా కులాల వారీగా జనగణనకు పట్టుబడుతూ పీఎంకే అన్బుమణి శిబిరం నేతృత్వంలో చైన్నె మహా నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో బీజేపీ తరపున ప్రతినిధులు హాజరైనా, అన్నాడీఎంకే , టీవీకే తరపున ఎవ్వరూ రాలేదు. వివరాలు.. పీఎంకే అన్బుమణి శిబిరం నేతృత్వంలో కులగణన నినాదంతో చైన్నె ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం ఆవరణలో నిరసనకు పిలుపు నిచ్చారు. ఇందులో పాల్గొనాలని ముందుగానే బీజేపీ, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే తదితర పార్టీలకు ఆహ్వానం పలికారు. అయితే, బుధవారం జరిగిన నిరసనకు పెద్దఎత్తున అన్బుమణి మద్దతు పీఎంకే వర్గాలు తరలివచ్చాయి. బీజేపీ, పురట్చి భారతం తదితర పార్టీల తరపున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే అన్నాడీఎంకే, టీవీకేల నుంచి ఎవ్వరు రాలేదు. ఈ నిరసనలో రాష్ట్రంలో కులగణన జరగాల్సిందేనని నినాదాలను హోరెత్తించారు. సామాజిక న్యాయం పేరిట అన్ని వర్గాలను డీఎంకే ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ, పదే పదే సామాజిక న్యాయం అని వ్యాఖ్యలు చేసే సీఎం స్టాలిన్ ఏ విధంగా దీనిని అమలు చేస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. 1931 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇక్కడ అమల్లో ఉన్నాయని మండిపడ్డారు. ఆ కాలంలో టీవీలు లేవు. సాంకేతికత లేదు. ఇంకా చెప్పాలంటే అంబాసిడర్ కార్లు కూడా లేవు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాత లెక్కలను పట్టుకుని వేలాడటమే కాదు, కాలం నెట్టుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడులో ఉన్న అన్ని సామాజిక వర్గాల పరిస్థితి ఏమిటీ అన్నది తేట తెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఎట్టకేలకు కేంద్రం 2027 జనాభా లెక్కింపుతో పాటుగా కులగణన జరుపుతామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అంతకు ముందుగా తమిళనాడులో ప్రత్యేకంగా కులగణన జరగాల్సిందేనని, ఈ వ్యవహారంలో సీఎం స్టాలిన్ ఎందుకు భయ పడుతున్నారని ప్రశ్నించారు.
నిరసనలో పాల్గొన్న అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే వర్గాలు
చైన్నెలో మరో
600 ఎలక్ట్రిక్ బస్సులు
వాతావరణ మార్పులను ఎదుర్కొనడంలో గానీయండి, పర్యావరణ పరిరక్షణలో గానీయండి మహిళలను సైతం ఈ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందన్నారు. 100 మహిళా స్వయం సహాయక బృందాలకు ప్లాస్టిక్ నిర్మూలన ప్రచారం విస్తృతం చేయడానికి 100 ఎలక్ట్రిక్ ఆటోలను అందజేశామన్నారు. చైన్నె వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నాయని, కాలుష్య నియంత్రణ దిశగా ఎలక్ట్రిక్ బస్సులపై దృష్టి పెట్టామని, తాజాగా 120 బస్సులు సేవలు అందిస్తుండగా, త్వరలో 600 బస్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. సహజ వనరులను పరిరక్షించడంలో ముందంజలో ఉన్నామని పేర్కొంటూ, ఇందుకు గాను ఐక్యరాజ్యసమితి నుంచి అదనపు ప్రధానకార్యదర్శి సుప్రియ సాహు అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారని గుర్తు చేస్తూ ప్రశంసించారు. గ్లోబల్ వార్మింగ్ గురించి గుర్తు చేస్తూ 2070 కి ముందు మనం నికర జీరో లక్ష్యాన్ని సాధించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధికి కేంద్రంకేవలం 17 శాతం మాత్రమే విడుదల చేసిందని విమర్శించారు. తాము రూ. 24 వేల 679 కోట్లు కోరగా, కేవలం రూ. 4,136 కోట్లను మాత్రమే అందించారన్నారు. తమిళనాడు అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని గుర్తు చేస్తూ, అన్నింటా పోరాటం తప్పడం లేదని, చివరకు విజయం మనదే. ఆ విజయం కూడా దేశానికి మార్గదర్శకంగా ఉంటున్నాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, దీనిపై పోరాడుదాం.. విజయం సాధిద్దామని పిలుపు నిచ్చారు. ముందుగా బ్లూ కార్బన్ వెల్త్ ఆఫ్ తమిళనాడు, తమిళనాడు ఫిష్ నెట్ ఇన్సియేటివ్ టూ రెడ్యూస్ మైరెన్ లెటర్ ఫ్రం డిశ్చార్జ్ ఫిష్ నెట్స్ మైరెన్ లెటర్ ఆన్ తమిళనాడు కోస్టల్ పేరిట రూపొందించిన నివేదికలను సీఎం స్టాలిన్ విడుదల చేశారు.
సాక్షి,చైన్నె: తిరుప్పర కుండ్రం దీపం వివాదం వ్యవహారంలో అధికారుల తీరుపై జస్టిస్ జీఆర్ స్వామినాథ్‌న్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమగ్ర నివేదికతో మళ్లీ జనవర్ 9న కోర్టుకు రావాలని జిల్లా కలెక్టర్, మదురై కమిషనర్ అధికారులను ఆదేశించారు. తిరుప్పర కుండ్రం కార్తీక దీపం వెలిగింపు వివాదం గురించితెలిసిందే. అధికారులపై కోర్టు ధిక్కార కేసు ఓ వైపు జస్టిస్ స్వామినాథన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌లో బుధవారం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రభుత్వ అప్పీలు పిటిషన్‌పై ద్విసభ్య బెంచ్‌లోనూ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ముందు బుధవారం మదురై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులు హాజరయ్యారు. తన ఉత్తర్వులను అమలు చేయని అధికారుల తీరుపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణను జనవరి 9కి వాయిదా వేశారు. ఆరోజున సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
రాందాసు ఫైర్
పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జరిగిన నిరసనలో పీఎంకే పేరును, జెండాను, తనపేరును అన్బుమణి వాడుకోవడాన్ని రాందాసు తీవ్రంగా ఖండించారు. తైలాపురంలో పీఎంకే వర్గాలతో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్బుమణిపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకు పడ్డారు. తన పేరు వాడుకోకూడదని హెచ్చరించినా, అన్బుమణి వాడుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. పార్టీని కష్టపడి మహా వృక్షంగా తాను మలిచితే, దాని కొమ్మలను నరికేసే పనిలో అన్బుమణి ఉన్నాడని ధ్వజమెత్తారు. పార్టీ పరంగా వివాదం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు ఉన్నా, దానిని పట్టించుకోకుండా, తన పేరు, తన ఫొటోలను వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అన్బుమణిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈనెల 26వ తేదీన సేలంలో పార్టీ జనరల్ కమిటీ సమావేశం జరుగుతుందని ఈసందర్భంగా ప్రకటించారు.
విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!
విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!
విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!
విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!
విపత్తుల నిర్వహణలో.. దేశానికే మార్గదర్శకం!


