రూ. 14 కోట్లతో జంతు సంరక్షణ సేవలు
సాక్షి, చైన్నె: కోయంబత్తూరుకు చెందిన పెంపుడు జంతువుల సంరక్షణ సంస్థ రూ. 14 కోట్ల నిధిని సేకరించింది. దీని ద్వారా పెంపుడు జంతువులకు పోషకాహార ఉత్పత్తి, పరిశోధనపై దృష్టి పెట్టనున్నది. ఈ వివరాలను రైట్ 4 పవ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ధనురాయ్ స్థానికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, పెంపుడు జంతువుల పోషకార ప్రమాణాలను పెంచాలన్న తమ లక్ష్యానికి బలాన్ని చేకూర్చే విధంగా నిధుల సేకరణ జరిగిందన్నారు. సంపూర్ణ ఆహారాల ప్రయోజనాలను ఆధునిక పొడి పోషకాహార సౌలభ్యంతో పెంపుడు జంతువుల మెరుగైన ఆరోగ్యాన్ని కాంక్షించే విధంగా ఉత్పత్తి, పరిశోధనలపై దృష్టి పెట్టనున్నామని వివరించారు. పారదర్శకత, పరిశోధన, ఆవిష్కరణ, పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ అంశాలపై నిబద్ధతతో కట్టుబడి ముందు కెళ్లనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సహ వ్యవస్థాపకుడు సమీర్ అచన్ తదితరులు పాల్గొన్నారు.


