ఏఐ ఆధారిత క్లినిక్ సేవలు
సాక్షి ,చైన్నె: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గదర్శకత్వంలో చైన్నె కోడంబాక్కంలో మైనస్ స్లిమ్మింగ్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో ప్రపథమంగా ఏర్పాటు చేసిన క్లినిక్ ఇదేనని నిర్వాహకులు ప్రకటించారు. దీనిని సినీ నటులు కాళిదాస్ జయరామన్ తో కలిసి నిర్వాహకుడు శరణ్ వేల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆరోగ్యం, సౌందర్యంపై బలమైన ఆసక్తిని చూపుతున్నారని అన్నారు. ఈక్రమంలో ఏఐ విధానంలో మైనస్ స్లిమ్మింగ్ క్లినిక్ టెక్నాలజీని చైన్నెలో అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏఐ –ఆధారిత పరికరాలతో చికిత్సలు ఇక్కడ అందించటం జరుగుతుందన్నారు. నాన్–ఇన్వాసివ్ బాడీ –కాంటౌరింగ్ చికిత్సలు , బరువు, కొవ్వు తగ్గింపు, చర్మాన్ని బిగుతుగా చేయడం వంటి క్లినికల్ సేవలకు ఇది కేంద్రంగా పేర్కొన్నారు.


