తిరుత్తణి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
తిరుత్తణి: వారంతపు సెలవుదినంతో పాటూ శుభముహూర్త రోజు సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తజనం సందడి నెలకొంది. తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం వేకువజామున స్వామికి అభిషేక, ఆరాధన పూజలు నిర్వహించారు. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాలు ద్వార ఘాట్‌రోడ్డు మార్గంలో కొండ ఆలయంకు పోటెత్తారు. దీంతో ఘాట్‌రోడ్డులో వాహనాలు స్తంభించి వాహన చోదకులు, భక్తులు ఇబ్బందులు చెందారు. ఆలయ మాడ వీధుల్లో భక్తజనం సందడితో సర్వ దర్శన క్యూలైన్‌లు నిండాయి. రూ. 100 ప్రత్యేక దర్శన క్యూలైన్‌లు సైతం కటకిటలాడాయి. ఉచిత దర్శనానికి మూడు గంటలు పట్టగా, రూ. వంద దర్శనకం రెండు గంటల సమయం వేచివుండాల్సి రావడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు చెందారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి కనిపించింది. ఆలయంలో వివిధ అభివృధ్ది పనులు జరుగుతున్న నేపధ్యంలో అన్నదాన కేంద్రం, వాహనాల పార్కింగ్ కేంద్రం వద్ద స్థల సమస్యతో భక్తులు అవస్థలు పడ్డారు.
తిరుత్తణి ఆలయానికి పోటెత్తిన భక్తజనం


