ఐఐటీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
సాక్షి, చైన్నె: మద్రాసు ఐఐటీలో స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతితో కలిసి పోటీల జరగనున్నాయి. ఇంటర్ కాలేజీ క్రీడా కార్యక్రమంలో 12 విభాగాలలో 3,800 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఈ పోటీలను ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి, భాతర క్రికెట్ సాయి సుదర్శన్, మాజీ క్రికెట్ శ్రీధరన్ శ్రీరామ్, భాస్కట్ బాల్ జట్టు కెప్టన్ మయిన్ బెక్ హఫీజ్‌లు హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా కామకోటి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను ఇక్కడ సృష్టిస్తున్నామన్నారు. స్పోర్ట్స్ సైన్స్, క్యాంపస్‌లోని మరిన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను కూడా ప్రారంభించామని వివరించారు. సాయి సుదర్శన్ మాట్లాడుతూ క్రీడలను కెరీర్‌గా కొనసాగించాలనుకునే విద్యార్థులందరికీ గొప్పఅనుభవం అవకాశంగా పేర్కొన్నారు.
ఐఐటీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం


