సిద్ధ వైద్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?
తిరువొత్తియూరు: తమిళుల సంప్రదాయ సిద్ధ వైద్య విధానాన్ని గవర్నర్ ఎందుకు ద్వేషిస్తున్నారు, ఆయనకు ఎందుకు నచ్చడం లేదనేది ఎవరికీ తెలియదని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రశ్నించారు. చైన్నె తేనాంపేటలోని డీఎంఎస్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో 405 మంది ప్రాంతీయ ఆరోగ్య నర్సులకు, 117 మంది బ్లాక్ హెల్త్ సూపర్‌వైజర్లకు మంత్రి సుబ్రమణియన్ పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో సిద్ధ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిందన్నారు. చాలా కాలం తర్వాత గవర్నర్ రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఆ తర్వాత హోంమంత్రిత్వ శాఖ లేవనెత్తిన ప్రశ్నలకు న్యాయ నిపుణుల ద్వారా ప్రభుత్వం ఇచ్చిందన, మళ్లీ గత అక్టోబర్ 16న గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఫైలు, ప్రస్తుతం మళ్లీ రాష్ట్రపతికి పంపారని చెప్పారు. తమిళుల సంప్రదాయ వైద్యమైన సిద్ధ వైద్య విధానాన్ని గవర్నర్ ఎందుకు ద్వేషిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే జనవరిలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో 1,479 మంది నర్సులకు ముఖ్యమంత్రి నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారని తెలిపారు. 2026 ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ డీఎంకే గెలుస్తుందని మంత్రి అన్నారు.
రైలులో మహిళ మృతి
అన్నానగర్: రైలులో అస్వస్థతకు గురై ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందింది. తిరువనంతపురం నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి నాగర్‌కోయిల్ టౌన్ స్టేషన్‌న్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఆ రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. వెంటనే వల్లియూర్ రైల్వేస్టేషన్‌న్‌లో అంబులెనన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఆమెను నాగర్‌కోయిల్‌లోని ఆసరిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు తిరువనంతపురానికి చెందిన పెపియోలా (63)గా గుర్తించారు.
శ్రీవారిని దర్శించుకున్న నటుడు విక్రమ్‌ప్రభు
తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం సినీ నటుడు విక్రమ్ ప్రభు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.


