క్లుప్తంగా
కిందపడి బాలిక మృతి
అన్నానగర్: ఆడుకుంటూ కిందపడి ఓ బాలిక మృతిచెందింది. మాంగాడు సమీపంలోని మలయంబాక్కంలోని శక్తినగర్‌కు చెందిన సతీష్. ఇతని కుమార్తె షాలినిశ్రీ (6). ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. సోమవారం షాలినిశ్రీ ఇంటి బయట వీధి పిల్లలతో ఆడుకుంటోంది. ఆసమయంలో షాలినిశ్రీ కాలికి రాయి తగిలి కింద పడింది. వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మాంగాడు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.
10 చోట్ల ఐటీ సోదాలు
సాక్షి, చైన్నె: చైన్నెలో సోమవారం పది చోట్ల ఐటీ అధికారులు విస్తృత సోదాలలో నిమగ్నమయ్యారు. నుంగంబాక్కం స్టెర్లింగ్ రోడ్లులోని ఓ ప్రైవేటు సంస్థ, టీ నగర్‌లో ఒక ఆ భరణాల షోరూంతో పాటూ పది చోట్ల ఉదయం నుంచి పొద్దు పోయే వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలతో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
వండలూరు జూలో సింహం మృతి
అన్నానగర్: చైన్నె సమీపం వండలూర్‌లోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ’రాఘవ్’ అనే మగ సింహం మృతిచెందింది. ఈ సింహం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. జూ వెటర్నరీ వైద్యులు చికిత్స అందించినా సోమవారం మృతిచెందింది. వెటర్నరీ వైద్యులు సింహం కళేబరానికి పోస్ట్‌మార్టం నిర్వహించి జూ ఆవరణలోనే ఖననం చేశారు. గత నెలలో లయన్ సఫారీ ప్రాంతంలో సంరక్షించబడుతున్న భువన అనే ఆడ సింహం అనారోగ్యంతో మృతిచెందడం గమనార్హం.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
కొరుక్కుపేట: ఢిల్లీ నుంచి చైన్నెకి ఇండిగో విమానం మంగళవారం ఉదయం వచ్చింది. ఆ విమానంలో 100 మందికి పైగా ఉన్నారు. విమానం గాల్లో ఉన్నప్పుడు బాంబు బెదిరింపు వచ్చింది. చైన్నె విమానాశ్రయంలో బాంబు బెదిరింపుకు సంబంధించి ఈమెయిల్ రావడంతో విమానం చైన్నె విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు నిపుణులు వెంటనే విమానంలో తీవ్ర తనిఖీలు నిర్వహించారు. ఇందులో బాంబులు సహా ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు గుర్తించలేదు. దీంతో బాంబు బెదిరింపు బూటకమని తేలింది. తదనంతరం బాంబు బెదిరింపు ఎవరు చేశారు? అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే, ఎయిర్ సర్వీస్ సమస్య కారణంగా విమానాలు రద్దయ్యి గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంగళవారం ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం సంచలనం కలిగించింది.
నకిలీ బంగారు నాణెంతో మోసం
అన్నానగర్: నకిలీ బంగారు నాణెం ఇచ్చి రూ.5లక్షలు మోసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెన్‌కాసి జిల్లాలోని కరివలం వందనల్లూర్ ప్రాంతానికి చెందిన రామర్. ఇతను కొంత మంది నుంచి రూ.5లక్షలకు బంగారు నాణెం కొన్నాడు. కానీ అది నకిలీ నాణెం అని తేలడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో రాజపాళయం పోలీసులు కాంచీపురం జిల్లా పుదుబాక్కం ప్రాంతానికి చెందిన శక్తివేలు (67), విల్లుపురం జిల్లా తిరుకై ్క గ్రామానికి చెందిన పాండురంగన్ (60), ఇతని భార్య అరసాయి (56), చైన్నెకి చెందిన షణ్ముగం (61)లను కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
బంగారం ప్రదర్శన
కల్యాణ్ జ్యువెలర్స్ సరికొత్త డిజైన్లను ఆవిష్కరించింది. చైన్నె ఈసీఆర్,రెడ్ హిల్స్‌లలో ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్‌లలో వీటిని కొలువు దీర్చారు. సినీ నటుడు ప్రభు, నటి ఐశ్వర్య లక్ష్మిలు వివిధ సిగ్నేచర్ జ్యువెలరీ లైన్లు, విస్తృత డిజైన్ సేకరణ కలెక్షన్లను ఈసందర్భంగా పరిచయం చేశారు. కల్యాణ్ జ్యువెలర్స్ ఎండీ రమేష్ కల్యాణరామన్ స్పెషల్ గోల్డ్ బోర్డు రేట్‌ను ఈసందర్భంగా ప్రకటించారు. – సాక్షి, చైన్నె
15న ఆలయాల కుంభాభిషేకం
తిరువొత్తియూరు: చైన్నె చూళైమేడు హైవేలో సమీపంలోని ప్రసన్న వెంకటపెరుమాళ్, వినాయక దేవాలయ కుంభాభిషేకం 15వ తేదీన జరుగనుంది. దీనికి సంబంధించి 12వతేదీన గణపతి పూజ, వాస్తు శాంతి జరుగుతాయి. 13న గణపతి హోమం, నవగ్రహ హోమం, ధనలక్ష్మి పూజ, మొదటి కాల యాగశాల పూజ నిర్వహిస్తారు. 14న 2, 3వ కాలయాగశాల పూజ, విగ్రహాల ప్రతిష్ట జరుగనుంది. 15వ తేదీ ఉదయం 6 గంటలకు గోపుర కుంభాభిషేకం నిర్వహిస్తారు. 6.30 గంటలకు శక్తి వినాయకర్ ,పరివార స్వాములకు మహా కుంభాభిషేకం జరుగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తిరుకల్యాణం జరుగనుంది.


