దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
● వీకేఆర్‌పురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ● ముగ్గురు మృతి ● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ● మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పోటు కార్మికులు ● క్షణంలో విషాదయాత్రగా మారిన ఆధ్యాత్మిక యాత్ర
నా భర్తకు ఫోన్ చెయ్యండి.. మాట్లాడాలి
తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ్‌సెల్వి వేదన అంతాఇంతా కాదు. తన భర్తకు ఫోన్ చెయ్యండి మాట్లాడాలి.. అంటూ చేసిన ఆర్తనాధాలు అందరినీ కలచివేశాయి. తాంబరం ఆస్పత్రిలో హెడ్ నర్స్‌గా పనిచేస్తున్న ఆమె అప్పటికే గుండె సంబంధిత వ్యాధి ఉందని వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో ఇటు వైద్యులు, అటు పోలీసులు భర్త చనిపోయాడన్న విషయాన్ని ఆమెకు చెప్పలేదు. ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెబుతూనే తమిళ్‌సెల్వికి వైద్యచికిత్స అందించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ డూడి
నగరి : మండలంలోని వీకేఆర్‌పురం సమీపం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటులో పనిచేసే సంతానం (39), శంకర్ సుబ్రమణి (50)కాగా మరొకరు చైన్నె మేడంబాక్కంకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అరుణ్‌కుమార్ (40) ఉన్నారు. అలాగే తమిళ్‌సెల్వి (36), మదన్ (40), యశ్వంత్ (11)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో చైన్నె, తాంబరంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పోలీసుల కథనం.. తిరుచానూరు ఎస్‌వీపీ కాలనీలో నివాసమున్న సంతానం, సమాజం వీధిలో ఉన్న శంకర్‌సుబ్రమణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటులో పనిచేస్తున్నారు. ప్రతి మంగళవారం వీరిద్దరూ కలిసి కారులో తిరుత్తణికి వెళ్లి సుబ్రమణ్యస్వామిని దర్శించుకొని వస్తుంటారు. సంతానం కారు డ్రైవ్ చేసుకొని వెళుతుంటారు. అలాగే చైన్నెకి చెందిన అరుణ్‌కుమార్‌కు తిరుమలకు వెళ్లి చెల్లించాల్సిన మొక్కుబడి ఉండడంతో తమ కారుకు మదన్ అనే డ్రైవర్‌ను ఏర్పాటుచేసుకొని భార్య తమిళ్‌సెల్వి, చెల్లెలు కుమారుడు యశ్వంత్‌తో పాటు తిరుమలకు బయలుదేరాడు. మంగళవారం ఉదయం నగరి మండలం వీకేఆర్ పురం వద్ద వస్తున్న సమయంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జుకాగా సంతానం, శంకర్ సుబ్రమణి, అరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, సీఐ మల్లికార్జునరావు కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడంతో పాటు, తీవ్రగాయాలపాలైన వారిని నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మల్టిపుల్ ఫ్రాక్చర్ ఉండడంతో ప్రథమ చికిత్స అందించి చైన్నె ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సంతానంకు భార్య, యూకేజీ చదివే బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. శంకర సుబ్రమణ్యంకు భార్య, యుక్తవయసుకు వచ్చిన ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇతను డయాలసిస్ వ్యాధి చేయించుకుంటున్నారు. అరుణ్‌కుమార్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అరుణ్‌కుమార్ మృతదేహం
అతివేగమే కారణమా?
ప్రమాదానికి అతివేగంతో పాటు ఓవర్‌టేక్ చేయడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. హైవే పనులు జరుగుతుండంతో రోడ్డుకు రెండు వైపులా గోతులు తీశారు. రోడ్డుపై రెండు వాహనాలు మాత్రమే ప్రయాణించే వీలుంది. ఇరువురిలో ఒకరి కారు వేగంగా వెళుతూ ముందువెళ్లే వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన కారును ఢీకొన్నట్టు స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు.
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు


