బ్రేక్స్ ఇండియాతో టీబీకే వర్తక ఒప్పందం
సాక్షి, చైన్నె : బ్రేక్స్ ఇండియా, టీబీకే మధ్య వర్తక, మూలధన ఒప్పందాలు జరిగాయి. స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో బ్రేక్స్ ఇండియా ఎండీ శ్రీరామ్ విజి, టీబీకే అధ్యక్షుడు కౌరు ఒగాటాలు సంతకాలు చేశారు. రెండు సంస్థలుసాంకేతిక బలాలు, వినియోగదారులకు పూర్తిస్థాయిలో సేవలను అందించే విధంగా ముందుకెళ్లనున్నట్టు ప్రకటించారు. కొత్త అవకాశాలు కల్పించడం, పరిష్కారాలను అన్వేషించడం, వాణిజ్య వాహనాల బ్రేకింగ్ కోసం, వాటాదారులకు మెరుగైన విలువ సృష్టించేందుకు ఈ ఒప్పందం మార్గంగా పేర్కొన్నారు.


