రోడ్డు భద్రతపై అవగాహన
కొరుక్కుపేట: ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సేఫ్ డ్రైవింగ్ ,సేవ్ లైఫ్ పేరుతో గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ పోలీసులు, విలివాక్కం ట్రాఫిక్ పోలీసులతో కలసి విల్లివాక్కంలోని కనకదుర్గ తెలుగు మహోన్నత పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీఎంకే రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకుని రోడ్డు భద్రతపై వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాల కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సీఎం కిషోర్, డా.నందగోపాల్, డా.ఎన్.నాగభూషణం, ఎన్.నరసింహులు, మహేంద్రబాబు, హెచ్‌ఎం శారాసుహాసిని, విల్లివాక్కం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఉమామహేశ్వరి, ట్రాఫిక్ ఎస్‌ఐలు శక్తి వేలు, మురళి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


