విమాన చార్జీలకు రెక్కలు
– ప్రయాణికులకు అవస్థలు
సాక్షి, చైన్నె: ఇండిగో విమాన సేవల రద్దుతో ఇతర విమానాలలో చార్జీలు అమాంతంగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని తిరుచ్చి, తూత్తుకుడి, సేలం, మదురై, కోయంబత్తూరులకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తప్పలేదు. అలాగే ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా ఇండిగో విమా నాలు బుధవారం నుంచి అనేకం రద్దు అవుతున్న విషయం తెలిసిందే. గురువారం చైన్నెలో 39 విమానాల సేవలు రద్దు అయ్యాయి. శుక్రవారం మరో 69 విమానాల సేవలు రద్దు అయ్యాయి. ఈ విమా నాలలో ముందస్తుగా రిజర్వు చేసుకున్న వారికి అవస్థలు తప్పడం లేదు. విమానాశ్రయంలో తమకు సరైన సమాచారం ఎవ్వరూ ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తూతు ్తకుడి విమానాశ్రయాలలో సైతం నెలకొంది. అదే సమయంలో ఇతర విమానాలలో టికెట్ల ధరలు అమాంతంగా పెరిగాయి. చైన్నె నుంచి కోల్‌కతాకు రూ.71 వేలు, ఢిల్లీకి రూ.62 వేలు, మదురైకు రూ.13 వేలు టికెట్ల ధరలు ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులకు షాక్ తప్పలేదు.


