ఘనంగా ధర్మనిధి ఉపన్యాసాలు
కొరుక్కుపేట: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల ధర్మనిధి ఉపన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం ప్రారంభ సమావేశం జరిగింది. డా. పాండురంగం కాళియప్ప, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈ ధర్మనిధి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ సభకు గోపురం సంస్థ అధినేత వై.వి. హరికృష్ణ పాల్గొని ధర్మనిధి ఉపన్యాస ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. బాలంత్రపు శ్రీమతి రామనాథ్, గుడిమెట్ల చెన్నయ్య తెలుగుశాఖ సేవలను కొనియాడారు. ఎల్.బి. శంకరరావు తెలుగుశాఖ చేసే కార్యక్రమ విశిష్టతలను, ధర్మనిధి ఉపన్యాసాల ఆవశ్యకతను, ధర్మనిధి ఉపన్యాసాల ప్రత్యేకతను తెలియజేశారు. నరేష్ వందన, ఆచార్య గంధం అప్పారావు ములమూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


