ఘనంగా నేవీ డే వేడుకలు
సాక్షి, చైన్నె: చైన్నెలోని వార్ మెమోరియల్ వద్ద భారత నావికాదళం నేతృత్వంలో గురువారం నేవీ డేను జరుపుకున్నారు. వార్ మోమోరియల్ వద్ద గౌరవ వందనం సమర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా, దేశం కోసం త్యాగం చేసిన సాయుధ దళాల వీర సైనికులకు నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి, తమిళనాడు అండ్ పుదుచ్చేరి ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీనియర్ అధికారులు, అనుభవజ్ఞులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, పాఠశాల పిల్లలు , భారత నావికాదళం, సైన్యం, వైమానిక దళం, కోస్ట్ గార్డ్ నుంచి సిబ్బంది , వారి కుటుంబ సభ్యులు పాల్గొని పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు .1971 ఇండో–పాక్ యుద్ధంలో భారత నావికాదళం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ, భారత నావికాదళ సిబ్బంది సేవ, త్యాగాలను హైలెట్ చేస్తూ ఈనేవీ డే వేడుకలు జరుపుకోవడం ఏటా నిర్వహిస్తున్నారు.


