ప్రసన్న వెంకటేశ్వర స్వామికి గరుడసేవ
తిరువళ్లూరు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గరుడ సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ మూలవర్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పోలి ఉంటుంది. దీంతో తిరుమలలో జరిగే ఉత్సవాలల్లో లాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలతో పాటు ఇతర సేవలను నిర్వహిస్తున్నారు. ప్రతి పౌర్ణమికి ఆలయంలో గరుడ సేవను సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయంలో గరుడ సేవను నిర్వహించారు. స్వామివారు తనకు ఇష్టమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.


