జాక్టో జియో సభ్యుల రాస్తారోకో
తిరువళ్లూరు: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాక్టోజియో ఆద్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. అయితే రాస్తారోకోకు అనుమతి లేకపోవడంతో 100 మంది ఉద్యోగులను అరెస్టు చేసి ప్రవేటు మండపానికి తరలించారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. ఉపాధ్యాయుల మద్య వున్న వేతన వ్యత్యాసాలను సరి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఎంఆర్‌పి ప్రభుత్వ నర్సులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఉద్యోగ బద్రతను కల్పించి వారికి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలను అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వున్న పని ఒత్తిడిని తగ్గించడంతో పాటూ సెలవు రోజుల్లో సమిక్ష సమావేశాలను నిర్వహించకూడదన్న ప్రధాన డిమాండ్‌లతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయుల ఐక్యవేదిక జాక్టోజియో ఆద్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిస్కరిస్తామని డీఎంకే ఎన్నికల మ్యానీపెస్టోలో సైతం ప్రకటించింది. అయితే ఇంత వరకు సమస్యలను పరిస్కరించలేదు. ఈ నేపద్యంలోనే ఐక్యకార్యచరణ వేదిక ఆద్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా తమ డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. కాగా ఉద్యోగుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకు దిగిన ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో జాక్టోజయో సంఘం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాక్టో జియో సభ్యుల రాస్తారోకో


