జిల్లాలో 75 ప్రత్యేక శిబిరాలు
తిరువళ్లూరు: జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి 75 శిబిరాలను ఏర్పాటు చేసి తద్వారా ఆశ్రయం కల్పిస్తున్నట్టు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని సంచార కులాలు, పారిశుద్ధ్య కార్మికులు, లోతట్టు ప్రాంతాలోని బాధితులు సహా వెయ్యి మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే కార్యక్రమం కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిధిగా మంత్రి నాజర్ హాజరై బియ్యం కూరగాయలు, పప్పు తదితర వాటిని అంఒదజేశారు. ఈ సందర్బంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ దిత్వా తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోనే భారీగా ప్రాణనష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 75 శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆహారంతో పాటూ నిత్యావసర వస్తువులను అందించినట్టు వివరించారు. ఆవడిలో వర్షపు నీరు వెళ్ళడానికి 30 కోట్లు రూపాయల వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టామని, హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నిలిచే నీరు ఓసీఎఫ్, సీవీఆర్డీ ప్రాంతాల మీధుగా వెళ్ళడానికి ఏర్పాట్లును చేస్తున్నట్టు తెలిపారు. ఆవడిలోని వేర్వేరు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని 24 గంటల లోపు తొలగించడానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవడి కార్పొరేషన్ కమిషనర్ శరణ్య పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్


