ప్రమిద జారిపడి అగ్ని ప్రమాదం
తిరుత్తణి: ప్రమిద జారిపడి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో పాత విద్యుత్ ఉపకరణాల రిపేర్ దుకాణంలోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. తిరుత్తణిలోని ఆంధ్రానగర్‌లో జయరామన్(42) తన ఇంటిపై టీవీ, ఏసీ, ప్రిడ్జి సహా విద్యుత్ ఉపకరణాలు రిపేర్ చేసే దుకాణం నడుపుతున్నాడు. ఎలక్ట్రిషియన్ పనులు చేస్తున్నాడు. బుధవారం కార్తీక దీపం సందర్భంగా సాయంత్రం దుకానంలో ప్రమిదలతో దీపాలు వెలిగించారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రమిద జారికింద పడి మంటలు చోటుచేసుకున్నాయి. వెంటనే అగ్ని మాపక శాఖ సిబ్బంది ఘటన ప్రాంతం చేరుకుని మంటలు కట్టడి చేశారు. అయితే అంతలో రూ. లక్ష విలువైన పాత ఎలక్ట్రికల్ వస్తువులు దగ్ధమయ్యాయి. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


