సీనియర్ సిటిజెన్ల కోసం ‘పెవిలియన్’
సాక్షి, చైన్నె: లాంకర్ హర్మోనియా పెవిలియన్ పేరుతో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక గృహాలను విస్తృతంగా నిర్మించనున్నామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ జేఎం చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానికంగా ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. శ్రీపెరుంబుదూరులో నిర్మించిన లాంకర్ హార్మోనియా పెవిలియన్‌లో వృద్ధుల కోసం 110 గృహాలను తీర్చిదిద్దామన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో, అన్ని రకాల సౌకర్యాలతో లాంకర్ పెవిలియన్లను మరిన్ని చోట్ల నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ ఆర్వీ శేఖర్, స్పెషల్ ప్రాజెక్టు డైరెకర్ వీకే అశోక్, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సీనియర్ సినీ నటి రేవతి శంకరన్ తదితరులు పాల్గొన్నారు.


