కమల్, రజనీ కాంబోలో సాయిపల్లవి?
సాయి పల్లవి
రజనీకాంత్, కమలహాసన్
తమిళసినిమా: తమిళం సినిమా మూలస్తంభాలైన కమలహాసన్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తరువాత సూపర్ స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘ కాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరు కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా అంతకు ముందు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది అనూహ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును పొందిన రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారన్నదే ఆ ప్రచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి సాయి పల్లవి నటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కమలహాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో కథానాయకిగా సాయి పల్లవి నటించారన్నది గమనార్హం. అదేవిధంగా రజనీకాంత్ నటించనున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రను నటుడు ఖదీర్ పోషించనున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
నటి తాన్యా రవిచంద్రన్
కమల్, రజనీ కాంబోలో సాయిపల్లవి?
కమల్, రజనీ కాంబోలో సాయిపల్లవి?


