విస్తృతంగా పారిశ్రామిక ఆవిష్కరణలు
సాక్షి, చైన్నె: పారిశ్రామిక పరికరాల ఆవిష్కరణలు విస్తృతం చేయడానికి ఐపీవీఎస్, ఐసీపీఈ 2025లో నిర్ణయించారు. ఆర్బిట్ ఎగ్జిబిషన్స్ మెగా ఎడిషన్– ఇండస్ట్రియల్ పంపులు, వాల్వ్‌లు, సిస్టమ్స్, ఇండస్ట్రియల్ కెమికల్ ప్రాసెస్ ఎక్విప్ మెంట్‌లను ఒకే వేదికపై తీసుకొస్తూ, చైన్నె నందంబాక్కం వర్తక కేంద్రంలో సదస్సు, ఆవిష్కరణల ప్రదర్శనలు జరిగాయి. చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్, రసాయనాలు, నీరు, మురుగునీరు, విద్యుత్‌శక్తి, ఆహారం, పానీయాలు, ఫార్మాస్యూటికల్స్, సిమెంట్, తయారీ ప్రక్రియ తదితర అంశాలపై సదస్సులో చర్చించారు. ఆర్బిట్ ఎగ్జిబిషన్స్ ఎండీ రూపెస్ వికామ్సే ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ భారత దేశంలోని ప్రాసెస్ పరిశ్రమలు, పరిశ్రమ సహకారం, ఆవిష్కరణ, స్థిరమైన అంశాలకు వేదికగా వివరించారు. తాజా సాంకేతికతలు, పరిష్కారాలు, ఆటో మేషన్, ఇంధనం, సామర్థ్యం, ఉత్పత్తి వంటి బీ2బీ నెట్ వర్కింగ్‌కు అవకాశాలు కల్పిస్తున్నట్టు ప్రకటించారు.


