విస్తృతంగా కోటి సంతకాల సేకరణ
సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో చైన్నెలోని తెలుగువారు, విద్యార్థులు, వైఎస్‌ఆర్ సేవాదళ్ వర్గాలు సైతం భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో ఈ సంతకాల సేకరణను చైన్నె, శివారులలో విస్తృతం చేశారు. వైఎస్‌ఆర్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, కార్యదర్శి సూర్యారెడ్డి, సంయుక్త కార్యదర్శులు నరేన్ రెడ్డి, భాను ప్రకాష్, సాయి సింహారెడ్డిలతో పాటుగా నిర్వాహకులు నరేంద్ర యాదవ్, అజయ్‌కుమార్‌రెడ్డి, కందుల కిషోర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, ఆది కేశవ తదితరులు పాల్గొన్నారు. చైన్నె, శివారులలోని పలు కళాశాలలో ని తెలుగు విద్యార్థులను కలిసి వారి మద్దతు సేకరించే విధంగా సంతకాల సేకరణలో శుక్రవారం నిమగ్నమయ్యారు. చైన్నెలోని భారత్ విశ్వవిద్యాలయంలోని తెలుగు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.


