విజయం మనదే..
తమరి ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకే నమ్మకం లేదంటూ, వాస్తవం ఏమిటో ప్రజలు గ్రహించారని వ్యాఖ్యలు చేశారు. 2026 ఎన్నికలు డీఎంకే, టీవీకే మధ్య మాత్రమే పోటీ అని స్పష్టంచేశారు. ఓటమి తదుపరి ప్రజా తీర్పునకు తల వంచుతున్నాం...అన్న ప్రకటనను విడుదల చేయడం తమరికి అలవాటేగా, ఈ సారి ముందుగానే ఆ ప్రకటనను సిద్ధం చేసి పెట్టుకోండి అంటూ సీఎం స్టాలిన్‌కు హితవు పలికారు. ప్రకృతి, దైవానుగ్రహం, తమిళ బంధాలు, ప్రజా శక్తి అండగా తనకు ఉండే వరకు రాజకీయంగా ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తంచేశారు. తాతాల్కింగా ఎదురైన నిశ్శబద్దాన్ని ఛేదించి ప్రజలతో చేతులు కలిపి ఎన్నికల క్షేత్రంలోకి దూసుకెళ్దామని నేతలకు పిలుపు నిచ్చారు. 2026 ఎన్నికలలో పోటీ మరింత బలం కానున్నదని, ఇందులో 100 శాతం విజయం మనదే..మనదే ..గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.


