అన్బుమణి మద్దతుదారుల ధర్నా
సేలం : ఎమ్మెల్యే అరుల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ కార్యాలయంలో అన్బుమణి మద్దతు దారులు ధర్నాకు దిగారు. కార్యాలయంలోకి చొరబడి ప్రవేశ మార్గంలో బైఠాయించడం ఉత్కంఠను రేపింది. వివరాలు.. పీఎంకే నేత రాందాసు మద్దతు ఎమ్మెల్యే అరుల్‌పై మంగవారం దాడి జరిగిన విషయంతెలిసిందే. అన్బుమణిమద్దతు దారులను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తమపై అరుల్ మద్దతుదారులు సైతం దాడిచేసినట్టుగా పేర్కొంటూ అన్భుమణి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఏకంగా ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అన్భుమణి మద్దతు పీఎంకే ఎమ్మెల్యేలు సదా శివం, శివకుమార్, గణేష్‌కుమార్‌ల నేతృత్వంలో నిరసన కారులు చొచ్చుకు రావడంతో ఉత్కంఠ నెలకొంది. వీరంతా ప్రవేశ మార్గంలో బైఠాయించడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.


